Movie News

ప్రీమియర్లు నేడే… తాడోపేడో తేలేదిప్పుడే

ఇంకొద్ది గంటల్లో అంటే రాత్రి తొమ్మిది నుంచి ప్యారడైజ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. పలు చోట్ల సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సులతో ఒప్పందాల్లో జరిగిన ఆలస్యం వల్ల కొంత లేట్ అయినప్పటికీ షో పడేనాటికి అన్ని పరిష్కారమయ్యే దిశగా డిస్ట్రిబ్యూటర్లు కృషి చేస్తున్నారు. ప్రీమియర్ టికెట్ ధర 500, 400 రూపాయలు ఉన్నా అంత డబ్బుకు న్యాయం దక్కుతుందనే నమ్మకం జనంలో కనిపిస్తోంది.

పెద్ది తర్వాత ఇంత హైప్, ఇంత బుకింగ్స్ ఏ సినిమాకు రాలేదు. మధ్యలో హిట్లు, సూపర్ హిట్లు ఉన్నాయి కానీ అవన్నీ వీటి రేంజ్ కాదు. అయితే ప్యారడైజ్ అనూహ్యంగా లెక్కలను మారుస్తోంది. నానిని నిన్నటిదాకా టయర్ 2 హీరోగా పరిగణించిన వాళ్ళు సైతం ఇప్పుడు తన మార్కెట్ ఎదుగుదల చూసి షాక్ అవుతున్నారు. ఇది ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే హాయ్ నాన్న టైంలో జరిగిన బిజినెస్, ఇప్పుడు ప్యారడైజ్ కు జరుగుతున్న వ్యాపారం మధ్య ఉన్న వ్యత్యాసం లెక్కేసుకుంటే చాలు.

ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ప్యారడైజ్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలకు ఇదే పెద్ద రిస్క్ అవుతుంది. పాజిటివ్ వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. మిక్స్డ్ వచ్చినా సోషల్ మీడియా వేదికగా లేనిపోని ప్రచారాలు చేసేందుకు కొన్ని బ్యాచులు సిద్ధంగా ఉంటాయి. ఇది ముందే గుర్తించిన నిర్మాత కోర్టు ద్వారా బోట్స్ నెగటివిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎవరి నోట విన్నా ప్యారడైజ్ మాట తప్ప మరొకటి వినిపించడం లేదు.

ఇంత హైప్ నిలబెట్టుకోవడం ముగ్గురి చేతుల్లో ఉంది. నాని, శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్ రవిచందర్ ద్వయం చేయబోయే మాస్ మేజిక్ కోసం సాధారణ ప్రేక్షకులు కూడా మంచి ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. కయదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయెల్, సంపూర్ణేష్ తదితరులు నటించిన ప్యారడైజ్ లో 80 దశకంలో సవారి అనే జాతి ఎదురుకున్న అవమానాలు, పోరాటాలు చూపించబోతున్నారు. సరిగ్గా క్లిక్ అయితే మటుకు రికార్డులతో బాక్సాఫీస్ హోరెత్తడం ఖాయం.

This post was last modified on September 23, 2026 3:54 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

22 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago