వైసీపీ అధినేత జగన్ కు, ఆయన చెల్లెలు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మధ్య రాజీ చర్చలు జరుగుతున్నట్లు కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆస్తి వివాదంతో అన్నా చెల్లెళ్ళ మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వివాదంలో కూతురు షర్మిలకు అండగా నిలిచిన తల్లి విజయలక్ష్మి ఇప్పుడు రాజీ యత్నాలు ప్రారంభించినట్లు కథనాలు వస్తున్నాయి.
అయితే ఇదంతా ఒట్టి పుకార్లే అని షర్మిల కొట్టి పారేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. నేను ఎవరినో కలిసినట్టు, ఎక్కడో చేరిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఒట్టి కట్టు కథలు, కల్పితాలు మాత్రమే. ఇవన్నీ నిరాధారం. గిట్టని వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారం అని ఖండించారు. నా కుమారుడు రాజారెడ్డి వివాహానికి పిలిచేందుకు చివరిసారిగా జగన్ గారిని కలిశాను. మళ్ళీ ఇప్పుడు కలిసినా నా కూతురు అంజలి వివాహానికి ఆహ్వానం అందించడానికి మాత్రమేనని షర్మిల క్లారిటీ ఇచ్చారు.
ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని, కన్న కూతురు వివాహాన్ని అడ్డం పెట్టుకొని తెరవెనుక రాజకీయాలు చేసుకునే ఖర్మ వైఎస్సార్ బిడ్డగా నాకు లేదని తీవ్రంగా వ్యాఖ్యనించారు. శుభకార్యానికి, రాజకీయానికి లింకులు నా విశ్వసనీయతను, రాజకీయ ప్రమాణికతను దెబ్బ తీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. షర్మిల మెసేజ్ తో గత కొన్ని రోజులుగా జరుతున్న ప్రచారమంతా ఒట్టి ఫేక్ అని తేలిపోయింది.
అయితే షర్మిల గురించి చేస్తున్న ప్రచారం వెనక వుంది ఎవరన్నది చర్చగా మారింది. షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసి ఆమెను ఒంటరిని చేసే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయమ్మ జోక్యం చేసుకొని రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం కూడా నిజమేనా, అదికూడా అబద్దమేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లి, చెల్లి కి దూరమైనట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు వైసీపీ దొడ్డిదారి ప్రయత్నంలో భాగంగా ఈ ప్రచారం జరుగుతుందా అన్నది తేలాల్సి వుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
This post was last modified on September 23, 2026 11:21 am
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…
ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…