రాజమౌళి వేగంగా సినిమాలు తీస్తారంటే ఎవరూ ఒప్పుకోరు. ఆయన మేకింగ్ స్టయిల్, తీసుకునే కథలు, క్యాస్టింగ్ ఇవన్నీ అంచనాలకు అతీతంగా చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి కాబట్టే ఏళ్లకేళ్లు షూటింగ్ చేసినా హైప్ పెరుగుతుంది తప్ప తగ్గదు. అలాంటిది వారణాసిని ఫాస్ట్ గా పూర్తి చేశారంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మహేష్ బాబు భాగం ఇటీవలే అయిపోయింది. ప్యాచ్ వర్క్స్ మినహా చిత్రీకరణ మొత్తం గుమ్మడికాయ కొట్టే స్టేజిలో ఉందట. సో ఇది పెద్ద స్పీడే.
ఇప్పుడీ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఉంది. వారణాసి షూటింగ్ గత ఏడాది జనవరి 24 మొదలయ్యింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 పూర్తయ్యింది. అంటే మొత్తం 606 రోజులు. ఆర్ఆర్ఆర్ కు పట్టిన సమయం 1011 రోజులు. అయితే దీనికి సహేతుకమైన కారణం ఉంది. ట్రిపులార్ ని జక్కన్న ఒక రిలీజ్ డేట్ అనుకుని మొదలుపెట్టారు. కానీ కరోనా వల్ల విపరీతమైన జాప్యం, బ్రేకులు పడి అనుకున్న టార్గెట్ చేరుకోలేకపోయారు. అది ఊహించని విపత్తు వల్ల జరిగిన లేట్.
వారణాసి విషయంలో అలాంటివి ఎదురు కాలేదు. అంతా సవ్యంగా జరిగిపోతోంది. ఏప్రిల్ రిలీజ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసే ఉద్దేశంలో టీమ్ లేదు. ఆల్రెడీ అంతర్జాతీయంగా అన్ని కోణాల్లో చూసుకుని క్లాష్ లేకుండా జాగ్రత్తగా ఆ డేట్ ఎంచుకున్నారు. అందుకే విఎఫెక్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా రాజమౌళి అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. అధిక సందర్భాల్లో సెకండ్ యూనిట్ల మీద ఆయన ఆధారపడటం ఉండదు.
సో మహేష్ బాబుని విముక్తుడిని చేశారంటే వారణాసికి రూట్ క్లియర్ అయ్యిందన్న మాట. పలు ఇంటర్నేషనల్ స్టూడియోలు పని చేస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ ప్రమోషన్లను డిసెంబర్ నుంచి ఉధృతం చేయబోతున్నారు. తెలుగుతో సమానంగా అన్ని భాషల్లో పబ్లిసిటీ ఒకే లెవెల్ లో ఉండేలా ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేశారట. తనయుడు కాలభైరవ పెళ్లి నేపథ్యంలో వీలైనంత త్వరగానే కీరవాణి రీ రికార్డింగ్ పనులను ఒక కొలిక్కి తెస్తారని సమాచారం. మొత్తానికి వారణాసి బృందంలో అందరూ దూకుడు మీదున్నారు.
This post was last modified on September 23, 2026 11:13 am
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…