Movie News

శ్రీకాంత్ ఓదెల ఆ విషయంలో రాక్షసుడు

తెలుగులో గొప్ప దర్శకులు అని పేరు తెచ్చుకున్న వాళ్లందరూ పని రాక్షసులే. ఇండియాలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి నటీనటులు, టెక్నీషియన్లను ఎలా కష్టపెడతాడో కథలు కథలుగా చెబుతూ ఉంటారు. మరో అగ్ర దర్శకుడు సుకుమార్ కూడా అంతే. పర్ఫెక్షన్ కోసం ఎన్ని టేకులైనా తీస్తాడని.. ఒక పట్టాన రాజీపడడని ఆయనకు పేరుంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల కు కూడా కూడా పని రాక్షసుడు అనే పేరుంది. ఇంకా చెప్పాలంటే పర్ఫెక్షన్ కోసం గురువుకంటే సుకుమార్‌ను మించి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను కష్టపెడతాడని తనతో పని చేసిన వాళ్లు చెబుతుంటారు.

ఒక సన్నివేశం కోసం వంద టేకులైనా తీస్తానంటూ స్వయంగా శ్రీకాంతే చెప్పుకొచ్చాడు ఇటీవల. ఐతే సినిమా రిలీజయ్యే టైంకి అందరూ దర్శకుడి గురించి పాజిటివ్‌గానే మాట్లాడతారు కానీ.. సెట్లో ఇలా మళ్లీ మళ్లీ టేక్స్ తీసుకుని, రోజుల తరబడి పని చేయించుకున్నపుడు ఆర్టిస్టులు తీవ్ర అసహనానికి గురవుతారనడంలో సందేహం లేదు. ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్‌గా నటించిన కాయదు లోహర్ తనకు ఇలాంటి ఫీలింగే కలిగినట్లు చెప్పకనే చెప్పింది.

ఒక ఇంటర్వ్యూలో ఆమె శ్రీకాంత్ పనితీరు గురించి మాట్లాడుతూ.. అతనో పని రాక్షసుడు అన్నట్లే మాట్లాడింది. ‘‘అతను క్రేజీ ఫెలో. అంచనాలకు అందడు. తన సెట్లోకి అడుగుపెడితే మనం ఏం చేయబోతున్నామో, ఏం జరుగుతుందో తెలియదు. ఒక ప్లాన్ అంటూ ఏమీ ఉండదు. తన పనితీరు చాలా భిన్నం. ఒక సన్నివేశం పూర్తి చేశాం.. మనం అదరగొట్టేశాం అనుకుంటాం. కానీ అతను ఇంకోలా ఆలోచిస్తాడు. అది మన ఆలోచనకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తన ఆలోచనలకు అనుగుణంగా నటిస్తే.. చివరికి ఆ సన్నివేశం తెరపై ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ మనలో కలుగుతుంది’’ అని కాయదు చెప్పుకొచ్చింది.

‘ది ప్యారడైజ్’ మీకు నేర్పిన పాఠం ఏంటి అని అడిగితే.. ఈ సినిమా తనకు ఓపికను నేర్పిందని చెప్పింది కాయదు. ఐతే ఎంత కష్టపడ్డా చివరికి అది సినిమా కోసమేనని.. అది బాగుంటే చాలని, తాము పడ్డ కష్టాన్ని జనం గుర్తిస్తారని ఆశిస్తున్నామని కాయదు వ్యాఖ్యానించింది. కానీ తెరపై చూసినపుడు ఉన్నంత అందంగా, సరదాగా తెర వెనుక విషయాలు ఉండవని చెప్పడం ద్వారా ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం మామూలు కష్టం పడలేదని చెప్పకనే చెప్పింది కాయదు.

This post was last modified on September 23, 2026 10:05 am

Share

Recent Posts

జగన్ స్పీచ్ లే ట్రోలర్స్ కు శ్రీరామ రక్ష

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి అధ్యక్షుడు…

5 minutes ago

“మీరు ఢిల్లీకి ఎందుకు రాలేదు?”.. రేవంత్ సీరియస్

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం కీల‌క చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జాతీయ‌స్థాయిలో 'ఓట్…

42 minutes ago

పెద్దిరెడ్డి పరువు పోయిందిగా!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డికి భారీ షాక్…

1 hour ago

రాప్తాడు గోపిక ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది?

అనంత‌పురం జిల్లా రాప్తాడు జ‌డ్పీ హైస్కూల్‌లో 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న గోపిక‌పై ఆమెకు అన్న వ‌రుస అయ్యే హేమంత్ ఉన్మాదిగా…

2 hours ago

భామలు చల్లే బురదకు బాధ్యులు ఎవరు

ఇటీవలే విడుదలైన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'అక్క' ప్రమోషన్లలో భాగంగా రాధికా ఆప్టే గతంలో తాను పని చేసిన…

3 hours ago

అదుపు తప్పుతున్న ‘ఆదర్శ’ కలం

మాటల మాంత్రికుడు, గురూజీ, సరస్వతి రూపం ఇలా ఎన్ని బిరుదులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అలంకారంగా ఉంటూ వచ్చాయో ప్రత్యేకంగా…

3 hours ago