వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఎన్నికలకు ముందు రాసుకున్న రెడ్ బుక్ ఇంకా మూసేయలేదని స్పష్టం చేశారు. దీనిని ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులపై దాడులు చేయడమే మీరు వారికి ఇచ్చిగౌరవమా? అని వ్యాఖ్యానించారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. డీఎస్సీ-2025లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కోర్టులు సైతం చెబుతున్నా.. వైసీపీ మూక మాత్రం వినిపించుకోవడం లేదన్నారు. ఇలాంటి వారికి ఎలాంటి గుణపాఠం చెప్పాలో పోలీసులే చెబుతారని హెచ్చరించారు.
విజయవాడలో జరిగిన ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని లోకేష్ చెప్పారు. వీటిని ఉపేక్షించేది లేదన్నారు. తాజాగా మంగళవారం అనంతపురంలో పర్యటించిన లోకేష్.. అక్కడి నుంచే వైసీపీ నాయకులను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ రౌడీయిజాన్ని సహించేది లేదన్నారు. రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉందని.. దాని పని అది చేసుకుంటూ పోతోందని చెప్పారు. ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు. పార్టీ పరంగా నాయకులు కూడా ఎక్కడికక్కడ ఉపాధ్యాయులపై జరిగిన దాడిని ఖండించాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఇది ఉపాధ్యాయులపై జరిగిన దాడి కాదని.. యావత్ రాష్ట్రంలోని ఉద్యోగులపై జరిగిన దాడిగా చూడాలన్నారు.
జాగ్రత్త జగన్ అంటూ.. ఈ సందర్భంగా లోకేష్ హెచ్చరించడం గమనార్హం. ప్రతి ఒక్కరి చిట్టా విప్పుతామని అన్నారు. తప్పు చేసిన వారిని ఒక్కరిని కూడా వదిలేది లేదన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని.. తొక్కుకుంటూ పోతుందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇప్పటికే లక్షన్నర కోట్ల రూపాయలను కేవలం సంక్షేమానికి ఖర్చు చేశామన్నారు. మరోవైపు వందల సంఖ్యలో కంపెనీలను తీసుకువస్తున్నామని తెలిపారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడుతున్నాయని లోకేష్ చెప్పారు. దీనిని చూసి ఓర్వలేక.. వైసీపీ నేతలు.. రౌడీయిజం ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు.
This post was last modified on September 23, 2026 11:34 am
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…