Movie News

నాని తీయాలనుకున్న ‘24’ సినిమా

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తెలుగులో టైర్-2లో టాప్ హీరో. ‘ది ప్యారడైజ్’ సినిమా అంచనాలను అందుకుంటే.. అతను టైర్1 హీరోలకు కూడా దగ్గరగా వెళ్లిపోయేలా ఉన్నాడు. ఐతే ఇంత పెద్ద స్టార్‌గా ఎదిగిన అతను.. ఇండస్ట్రీకి వచ్చింది అసలు నటుడు అవుదామనే కాదు. అతను యాక్సిడెంటల్ యాక్టర్ అని చెప్పాలి.

నాని దర్శకుడు అవుదామన్న లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా కొన్ని సినిమాలు చేశాడు. అందులో లెజెండరీ డైరెక్టర్ బాపు తీసిన ‘రాధాగోపాలం’ కూడా ఒకటి. ఐతే ఏదో కొన్ని రోజులు మొక్కుబడిగా ఏడీగా పని చేసి వెళ్లిపోవడం కాదు.. సినిమా తీయడానికి సన్నాహాలు కూడా చేసుకున్నాడట. అతనో కథ రాసి బౌండ్ స్క్రిప్టు కూడా రెడీ చేశాడట. కానీ అనుకోకుండా తాను హీరో అయిపోవడంతో ఆ స్క్రిప్టు అటకెక్కేసిందని నాని చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో అతను.. పట్టాలెక్కని ఆ సినిమా గురించి వెల్లడించాడు.

దర్శకుడిగా తన తొలి సినిమా కోసం నాని రాసుకున్నది యాక్షన్ సినిమా స్క్రిప్టు అట. ఆ సినిమాకు ‘24’ అనే టైటిల్ కూడా పెట్టుకున్నట్లు నాని తెలిపాడు. ఐతే అప్పటికి సూర్య సినిమా ‘24’ రాలేదని.. తనదే ఒరిజినల్ టైటిల్ అని నాని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ సినిమా స్క్రిప్టు రాసే సమయానికి తనకు 18 ఏళ్లే అని నాని చెప్పాడు. ఐతే ఇప్పుడు ఆ స్క్రిప్టు వర్కవుట్ అవుతుందా అంటే.. అవుతుందని నాని చెప్పాడు.

కాకపోతే ఈ కాలానికి తగ్గట్లు మార్పులు చేయాల్సి ఉంటుందన్నాడు. ఎవరైనా మంచి దర్శకుడి చేతిలో పడితే ఆ కథ హిట్టవుతుందని నాని వ్యాఖ్యానించాడు. మరి మీరే డైరెక్ట్ చేయొచ్చు కదా అని అంటే.. తన దారి మారిపోయిందని, ఇప్పుడు సినిమా తీయడం తన చేతుల్లో లేదని నాని వ్యాఖ్యానించాడు. మరి తన సన్నిహితులైన దర్శకులతో నాని ఈ స్క్రిప్టు గురించి చెప్పాడో లేదో కానీ.. ఇక ముందు ఎవరైనా డైరెక్టర్ ఆ స్క్రిప్టు తీసుకుని సినిమా తీస్తాడేమో చూడాలి.

This post was last modified on September 23, 2026 6:39 am

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

4 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

5 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

7 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

7 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

7 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

8 hours ago