ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ పేరు మీద మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి ఒకటికి పదిసార్లు స్క్రిప్ట్ తదితర విషయాలు ఆయన చూసుకునే ఉంటారు. ఫహద్ ఫాసిల్ హీరోగా శశాంక్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అక్టోబర్ 2 విడుదలకు రెడీ అవుతోంది. ఎలాగూ ఆదర్శ కుటుంబం ఒకవారం వాయిదా పడటంతో కాంపిటీషన్ లో ఉన్న రిస్క్ తప్పినట్టే.
ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది. కథేంటో చెప్పేశారు. చిన్న చిన్న తప్పులు నేరాలు చేసే సూరి (ఫహద్ ఫాసిల్) ఒకసారి స్కూల్ నుంచి దివ్య (సారా పాలేకర్) అనే పాపను కిడ్నాప్ చేస్తాడు. అనూహ్యంగా ఆ చిన్నారికి మేజిక్ పవర్స్ ఉంటాయి. నమ్మశక్యం కాని రీతిలో మాయాజాలం చేస్తుంటుంది. సూరితో మొదలైన స్నేహం వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పరుస్తుంది. దివ్య కోసం పోలీసులు వెతుకుతున్న క్రమంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవేంటనేది అసలు స్టోరీ.
ఎలివేషన్లు, వరల్డ్ బిల్డింగులతో కొంచెం రొటీన్ ఫీలవుతున్న ప్రేక్షకులకు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. చిన్న పిల్లలను లీడ్ క్యారెక్టర్ లో పెట్టి సినిమాలు తీయడం టాలీవుడ్ లో ఎప్పుడో మర్చిపోయారు. దర్శకుడు శశాంక్ చేసిన ఆలోచన అభినందనీయమే. కమర్షియల్ గా ఎంత దాకా వెళ్తుందనేది చెప్పలేం కానీ దసరా సెలవుల్లో ఫ్యామిలీస్ కి మంచి ఛాయస్ అయ్యేలా ఉంది. కాకపోతే ట్రైలర్ లాగే సినిమా కూడా మెప్పించేలా ఉంటే చాలు.
ది ప్యారడైజ్ రిలీజైన వారానికే రావడం వల్ల డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. రెండు వేర్వేరు జానర్లు కాబట్టి ఆడియన్స్ దేనికవే విడిగా ఉంటారు. ఫహద్ ఫాసిల్ పుష్ప తర్వాత చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదే. సోలో హీరోగా తన మార్కెట్ ని మరింత పెంచుతుందనే నమ్మకంతో హైదరాబాద్ లోనే ఉంటూ ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. హిందీ జోలికి వెళ్లకుండా తెలుగు తమిళ మలయాళం భాషల్లో ఏకకాలంలో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రిలీజ్ కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates