Movie News

నానికి ఓపెన్ గ్రౌండ్

టాలీవుడ్లో సెంటిమెంట్లు కొంచెం ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్లు నిజం అనిపించేలా అప్పుడప్పుడూ కొన్ని ట్రెండ్స్ నడుస్తుంటాయి. తెలుగులో ఎవ్వరూ ఊహించిన స్థాయిలో ఒక సినిమా బీభత్సమైన హిట్ అయితే.. ఆ తర్వాత కొన్ని వారాల పాటు ఏ సినిమా ఆడదని, కంటెంట్‌తో సంబంధం లేకుండా అన్ని చిత్రాలూ ఫెయిలవుతాయని ఒక సెంటిమెంట్ ఉంది. సంక్రాంతికి చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఎవ్వరూ ఊహించని విధంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యాక మూణ్నాలుగు నెలల పాటు స్లంప్ చూసింది టాలీవుడ్ బాక్సాఫీస్.

ఇక గత నెలలో రవితేజ మూవీ ‘ఇరుముడి’ ఇలాగే అంచనాలను మించిపోయి భారీ బ్లాక్‌బస్టర్‌ అయింది. ఆ తర్వాత నెల రోజుల పాటు ఏ తెలుగు చిత్రమూ ప్రభావం చూపలేకపోతోంది. గత మూడు వారాల్లో ఒక్క సినిమా కూడా నిలబడలేకపోయింది. ఈ ట్రెండ్ చూసే ఏమో.. వచ్చే వారానికి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. అనుమాన పక్షి, హనుమాన్ అంశ్ చిత్రాల పట్ల కొంచెం ఆసక్తి నెలకొన్నా.. అవి రెండూ వాయిదా పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సీక్రెట్ సోల్జర్ సహా కొన్ని చిన్న సినిమాలేవో వస్తుండగా.. వాటి మీద ప్రేక్షకుల ఆసక్తి అంతంతమాత్రమే.

పోనీ ‘ఇరుముడి’ అయినా ఈ వీకెండ్‌ను ఉపయోగించుకుంటుందా అంటే ఆ సంకేతాలు కూడా కనిపించడం లేదు. ఆల్రెడీ ఆ సినిమా స్లో అయింది. పైగా ఈ శుక్రవారమే నెట్ ఫ్లిక్స్ ఆ చిత్రాన్ని డిజిటల్‌గా రిలీజ్ చేస్తోంది. ఇంట్లో అందుబాటులో ఉన్న సినిమాను ఇక జనం థియేటర్లకు వెళ్లి ఏం చూస్తారు? కాబట్టి ఈ వీకెండ్ బాక్సాఫీస్ వెలవెలబోతున్నట్లే.

ఇది ఒక రకంగా నాని సినిమా ‘ది ప్యారడైజ్’కు ప్లస్సే. వచ్చే గురువారం ఈ సినిమా రిలీజ్ కాగా.. ముందు రోజే ప్రిమియర్స్ సందడి మొదలైపోతుంది. ‘ఇరుముడి’ తర్వాత సరైన సినిమా లేదని ఫీలవుతున్న జనం.. ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తారు. పోటీలో మరే సినిమా లేకుండా ఓపెన్ గ్రౌండ్ రెడీ అవడంతో ‘ది ప్యారడైజ్’ ఓపెనింగ్స్ మోతెక్కిపోవడం ఖాయం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. కలెక్షన్లకు ఆకాశమే హద్దు అన్నమాట.

This post was last modified on September 19, 2026 7:27 am

Share

Recent Posts

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

1 hour ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

1 hour ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

3 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

4 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

4 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

9 hours ago