టాలీవుడ్లో సెంటిమెంట్లు కొంచెం ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్లు నిజం అనిపించేలా అప్పుడప్పుడూ కొన్ని ట్రెండ్స్ నడుస్తుంటాయి. తెలుగులో ఎవ్వరూ ఊహించిన స్థాయిలో ఒక సినిమా బీభత్సమైన హిట్ అయితే.. ఆ తర్వాత కొన్ని వారాల పాటు ఏ సినిమా ఆడదని, కంటెంట్‌తో సంబంధం లేకుండా అన్ని చిత్రాలూ ఫెయిలవుతాయని ఒక సెంటిమెంట్ ఉంది. సంక్రాంతికి చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఎవ్వరూ ఊహించని విధంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యాక మూణ్నాలుగు నెలల పాటు స్లంప్ చూసింది టాలీవుడ్ బాక్సాఫీస్.
ఇక గత నెలలో రవితేజ మూవీ ‘ఇరుముడి’ ఇలాగే అంచనాలను మించిపోయి భారీ బ్లాక్‌బస్టర్ అయింది. ఆ తర్వాత నెల రోజుల పాటు ఏ తెలుగు చిత్రమూ ప్రభావం చూపలేకపోతోంది. గత మూడు వారాల్లో ఒక్క సినిమా కూడా నిలబడలేకపోయింది. ఈ ట్రెండ్ చూసే ఏమో.. వచ్చే వారానికి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. అనుమాన పక్షి, హనుమాన్ అంశ్ చిత్రాల పట్ల కొంచెం ఆసక్తి నెలకొన్నా.. అవి రెండూ వాయిదా పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సీక్రెట్ సోల్జర్ సహా కొన్ని చిన్న సినిమాలేవో వస్తుండగా.. వాటి మీద ప్రేక్షకుల ఆసక్తి అంతంతమాత్రమే.
పోనీ ‘ఇరుముడి’ అయినా ఈ వీకెండ్‌ను ఉపయోగించుకుంటుందా అంటే ఆ సంకేతాలు కూడా కనిపించడం లేదు. ఆల్రెడీ ఆ సినిమా స్లో అయింది. పైగా ఈ శుక్రవారమే నెట్ ఫ్లిక్స్ ఆ చిత్రాన్ని డిజిటల్‌గా రిలీజ్ చేస్తోంది. ఇంట్లో అందుబాటులో ఉన్న సినిమాను ఇక జనం థియేటర్లకు వెళ్లి ఏం చూస్తారు? కాబట్టి ఈ వీకెండ్ బాక్సాఫీస్ వెలవెలబోతున్నట్లే.
ఇది ఒక రకంగా నాని సినిమా ‘ది ప్యారడైజ్’కు ప్లస్సే. వచ్చే గురువారం ఈ సినిమా రిలీజ్ కాగా.. ముందు రోజే ప్రిమియర్స్ సందడి మొదలైపోతుంది. ‘ఇరుముడి’ తర్వాత సరైన సినిమా లేదని ఫీలవుతున్న జనం.. ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తారు. పోటీలో మరే సినిమా లేకుండా ఓపెన్ గ్రౌండ్ రెడీ అవడంతో ‘ది ప్యారడైజ్’ ఓపెనింగ్స్ మోతెక్కిపోవడం ఖాయం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. కలెక్షన్లకు ఆకాశమే హద్దు అన్నమాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates