Movie News

ఆ న‌లుగురు ద‌ర్శ‌కుడు… మ‌ళ్లీ కొత్త‌గానే

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒక‌టిగా నిలిచిపోయిన సినిమా.. ఆ న‌లుగురు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్దార్థ‌, క‌థ‌కుడు మ‌ద‌న్ కలిసి మ‌ళ్లీ ప‌ని చేయ‌లేదు. ఐతే నాలుగేళ్ల ముందు మ‌ద‌న్ మ‌ర‌ణించిన‌ప్ప‌టికీ.. ఆయ‌న అందించిన క‌థ‌తో చంద్ర‌సిద్దార్థ ఇప్పుడో సినిమా తీశారు. అదే.. ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు. 

ఏంటి ఇదంతా టైటిలేనా అని ఆశ్య‌ర్యం క‌లుగుతోందా? అవును. తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత సుదీర్ఘమైన టైటిల్ పెట్టి సినిమా తీశారు చంద్ర‌సిద్దార్థ‌. ఈ టైటిల్ సరిపోదని.. ఈ చిత్రానికి ‘ ఎ ఫర్‌బిడన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’ అనే క్యాప్షన్ కూడా జోడించారు. తన సొంత సంస్థ ‘ఫిల్మోత్సవ్’లోనే చంద్రసిద్దార్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపుగా అంద‌రూ కొత్త‌వాళ్లే న‌టించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేశారు.

చంద్ర‌సిద్దార్థ మ‌రోసారి వెరైటీ సినిమానే తీశాడ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. త‌న ప్రేయ‌సిని ఇంకొక‌రితో పంచుకోవాల‌ని చూసే అబ్బాయి.. త‌న పెళ్లి మండ‌పంలోనే కాబోయే భ‌ర్త‌తో పాటు ఇంకో వ్య‌క్తి కూడా త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పే అమ్మాయి.. ఇలా టిపిక‌ల్ క్యారెక్ట‌ర్లు, సిచువేష‌న్ల‌తో ఈ సినిమాను తీర్చిదిద్దాడు చంద్ర‌సిద్దార్థ‌. తొలి షాట్ నుంచే ఇది రెగ్యుల‌ర్ సినిమా కాదని, ఏదో ప్ర‌యోగాత్మ‌కంగా చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. 

ఈ క‌థ‌లో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంద‌ని ట్రైల‌ర్ సంకేతాలు ఇచ్చింది. బ్రెయిన్ మ్యాపిక్, మొమెరీస్, గిల్ట్ లాంటి అంశాల చుట్టూ ఈ క‌థ తిరుగుతుంద‌ట‌. ట్రైల‌ర్లో విజువ‌ల్స్, బీజీఎం బాగున్నాయి. పుల‌గం చిన్న‌నారాయ‌ణ మాట‌లు అందించిన ఈ సినిమాలో హర్ష, అమైరా గోస్వామి, సుజనారెడ్డి, ఇనయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ వారం ప‌లు చిన్న సినిమాల‌తో క‌లిసి బాక్సాఫీస్ బ‌రిలో దిగుతున్న చంద్ర‌సిద్దార్థ సినిమా.. ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

This post was last modified on September 19, 2026 7:25 am

Share

Recent Posts

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

59 minutes ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

1 hour ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

1 hour ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

8 hours ago

వైసీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌దా.. !

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో…

8 hours ago

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

9 hours ago