సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్, శ్రీలీల, కీర్తి సురేష్, సాయిపల్లవి ఇలా ఏవేవో పేర్లను పరిశీలించి, ఎవరెవరినో కలిసిన దర్శకుడు వేణు యెల్దండి ఈ కారణంగా అనుకున్న టైంకన్నా షూటింగ్ ఆలస్యంగా మొదలుపెట్టాల్సి వచ్చింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి మ్యూజిక్ కూడా దేవినే సమకూర్చుకుంటున్నారు. అంచనాలైతే గట్టిగానే ఉన్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఎల్లమ్మ ప్రాబ్లమ్ తీరిపోయిందట. హీరోయిన్ గా అనంతిక సనిల్ కుమార్ ని దాదాపుగా లాక్ చేసుకున్నట్టు వినికిడి. ఇటీవలే రోమాంచకంలో కనిపించిన ఈ కేరళ కుట్టికి మార్షల్ ఆర్ట్స్, భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. 8 వసంతాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను చేసిన విన్యాసాలు అందరినీ షాక్ కు గురి చేశాయి. అంతకు ముందు మ్యాడ్ లో నటించినప్పటికీ గుర్తింపు రావడానికి కొంచెం టైం పట్టింది. తమిళంలో మూడు సినిమాలు చేసినా పనవ్వలేదు.
ఎల్లమ్మలో ఛాన్స్ అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే హీరో దేవినే అయినప్పటికీ కథలో కీలక భాగం హీరోయిన్ చుట్టూ తిరుగుతుందట. పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కావడంతో వేణు యెల్దండి ఇంతగా జల్లెడ పట్టాల్సి వచ్చిందని టాక్. క్లైమాక్స్ లో వీళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు షాక్ కు గురి చేయడం ఖాయమనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. సో ఎలా చూసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనంతిక సనిల్ కుమార్ ని తీసుకోవడం ఖచ్చితంగా రైట్ ఛాయసే.
ఇక మిగిలిన విషయాలకు వస్తే ఎల్లమ్మ వచ్చే ఏడాది వేసవి టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ జరుపుకుంటోంది. గ్రామదేవత నేపధ్యమే అయినప్పటికీ మాస్ కు కావాల్సిన అంశాలతో పాటు సెంటిమెంట్, ఎమోషన్ పుష్కలంగా ఉంటాయని తెలిసింది. బలగం తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసిన వేణు ఈసారి భారీ ఖర్చుకు సిద్ధపడ్డారు. కథను విపరీతంగా ఇష్టపడిన దిల్ రాజు అందుకే రిస్క్ గురించి ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. దసరాకు టీజర్ వదిలే ఛాన్స్ ఉందని వినికిడి.
This post was last modified on September 16, 2026 5:28 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…