టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను ఒకట్రెండు వారాలు వెనక్కి జరపాలని ప్రయత్నించగా.. అందుకు ససేమిరా అన్న నిర్మాత నాగవంశీ తమ సినిమా ‘ఆదర్శ కుటుంబం’ను అక్టోబరు 2కే ఫిక్స్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో చేసేది లేక సెప్టెంబరు 24నే ‘ది ప్యారడైజ్’ను రిలీజ్ చేయబోతున్నాడు దాని నిర్మాత.
ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజయ్యే సినిమాల విషయంలోనూ పీటముడి బిగుసుకుంది. దాదాపు అరడజను సినిమాలు ఆ పండక్కి పోటీలో ఉండగా.. వీటిలో ఏది పక్కాగా వస్తుందో.. ఏది వెనక్కి తగ్గుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలే రెండు సంక్రాంతిని టార్గెట్ చేశాయి. అందులో ‘కాకా’కు ఆల్రెడీ జనవరి 13న రిలీజ్ అంటూ డేట్ కూడా ఇచ్చేశారు. ఆ దిశగా చకచకా షూటింగ్ చేస్తున్నారు.
ఐతే చిరు లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘విశ్వంభర’ సైతం వచ్చే సంక్రాంతికే రావాలని చూస్తోంది. ఈ మేరకు ఓటీటీ సంస్థతో కూడా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. కానీ తన సినిమాను వాయిదా వేయడానికి ‘కాకా’ డైరెక్టర్ బాబి కొల్లి ఒప్పుకోవట్లేదు. దీంతో ‘విశ్వంభర’ చిత్రానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన తమ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తేనే ప్రయోజనం ఉంటుందని.. అంతకంటే లేటైతే చాలా కష్టమని టీం భావిస్తోంది. దీంతో చిరు రంగంలోకి దిగి బాబిని, ‘కాకా’ను నిర్మాతను ఒప్పించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ప్రభాస్ రెండు సినిమాల విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొన్నట్లు సమాచారం. డిసెంబరు 3కు అనుకున్న ‘ఫౌజి’ సినిమాను వాయిదా వేయడం లాంఛనమే అని తెలుస్తోంది. నెక్స్ పాజిబుల్ రిలీజ్ డేట్ కోసం మార్చి మీద ఫోకస్ పెట్టారట.
ఐతే అదే నెలలో ప్రభాస్ మరో సినిమా ‘స్పిరిట్’ రావాల్సి ఉంది. ఐతే ‘స్పిరిట్’ను వాయిదా వేయించి మార్చిలో ‘ఫౌజి’ని రిలీజ్ చేయాలని ఆ చిత్ర బృందం ప్రయత్నిస్తుండగా.. సందీప్ రెడ్డి అందుకు అంగీకరించడం లేదట. తమ సినిమాకు పక్కాగా షెడ్యూల్స్ వేసుకుని మార్చి రిలీజ్ దిశగా అడుగులు వేస్తున్నాడు సందీప్. ఐతే ‘ఫౌజి’ ఆలస్యం అవుతుండడంతో ‘స్పిరిట్’కు ముందు చెప్పిన ప్రకారం కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితిలో లేడట ప్రభాస్. అందుకే అతను సందీప్‌కు సర్దిచెప్పి ఆ చిత్రాన్ని వాయిదా వేయించి.. ఫౌజికి లైన్ క్లియర్ చేయించాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.
This post was last modified on September 16, 2026 3:59 pm
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…