Movie News

మహారాజాకు దక్కిన హాలీవుడ్ గౌరవం

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త మూవీ లవర్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది. విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ క్రైమ్ రివెంజ్ డ్రామాకు నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగా ఆడింది. ఇంగ్లీష్ వెర్షన్ లో టైటిల్ రోల్ పోషించేందుకు ప్రముఖ నటుడు మాథ్యూ మెక్‌కానహేతో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం.

ఇది సౌత్ సినిమాకు దక్కిన గొప్ప గౌరవంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలను ఫ్రీగా రీమేక్ చేసుకోవడం కొన్ని వందలసార్లు జరిగింది. మోసగాళ్లకు మోసగాడు, ఖైదీలాంటి ఇండస్ట్రీ హిట్ల కథలు అక్కడి నుంచి స్ఫూర్తి పొందినవే. అయితే మహారాజాలాగా అఫీషియల్ గా హాలీవుడ్ కు వెళ్లడం మాత్రం ఇదే మొదటిసారి. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గడప తొక్కేలా టాలీవుడ్ స్థాయిని పెంచిన రాజమౌళి ఈసారి వారణాసితో మరిన్ని మెట్లు పైకెక్కేలా రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

వీటి సంగతలా ఉంచితే మన ఫిలిం మేకింగ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. జపాన్ దేశంలో ట్రిపులార్ ఎగబడి చూశారు. జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ మన జక్కన్న పనితనాన్ని మెచ్చుకున్నారు. ఓవర్సీస్ లో తెలుగు సినిమాల బిజినెస్ స్థాయి పెరుగుతోంది. మలయాళంలోనూ బెత్లెహాం కుటుంబ యూనిట్ లాంటివి పది మిలియన్లకు పైగా వసూళ్లు సాధించడం ట్రేడ్ ని షాక్ కు గురి చేసింది. ఇలా ఎన్నో ఘనతలు క్రమంగా దక్షిణాది స్థాయిని పెంచబోతున్నాయి.

వీటికి మహారాజా ఒక పునాది కావాలి. ఇకపై ప్రపంచ దేశాల్లోని ఇతర దర్శకులు మన రీమేక్ హక్కుల కోసం ఎగబడేలా సీన్ మారిపోవాలి. అన్నట్టు మహారాజాకు సీక్వెల్ కావాలని మూవీ లవర్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని చెన్నై వర్గాల్లో వినిపించింది కానీ ఇప్పటికైతే మూమెంట్ లేదు. విలన్ పాత్ర చనిపోయి స్టోరీ ముగించేశారు కాబట్టి బలవంతంగా సాగదీయకుండా అలాగే వదిలేస్తే బెటరేమోనని మూవీ లవర్స్ ఫీలింగ్.

This post was last modified on September 16, 2026 5:34 pm

Share

Recent Posts

ఎల్లమ్మకు దొరికింది మంచి ఛాయిసే

సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…

1 hour ago

చిరుకు వచ్చిన ఇబ్బందే ప్రభాస్‌కూ

టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…

3 hours ago

గోల లేకుండా డేట్ వేసుకున్న గూఢచారి 2

ప్యాన్ ఇండియా సినిమాలకున్న అతి పెద్ద సమస్య రిలీజ్ డేట్ వేసుకోవడం. ఒకవేళ మంచి తేదీ దొరికినా దానికి కట్టుబడి…

3 hours ago

డాల‌స్‌ థియేట‌ర్లో తెలుగు మెనూ

తెలుగు వాళ్లు అమెరికాకు వెళ్లి సెటిల్ కావ‌డం అన్న‌ది చాలా మామూలు విష‌యం అయిపోయింది ఈ రోజుల్లో. అక్క‌డ ఏ…

4 hours ago

హీరోగా మాయమై.. దర్శకుడిగా తిరిగొచ్చాడు

కార్తికేయ గుమ్మకొండ.. ఎనిమిదేళ్ల ముందు టాలీవుడ్లో మార్మోగిన పేరిది. తన తొలి చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’తో ఎలాంటి ప్రభావం…

4 hours ago

మక్కాలో తొలిసారి టెన్షన్…

ప్రపంచంలోని ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మక్కా నగరంలో తొలిసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హౌతీ తిరుగుబాటుదారుల వరస దాడుల…

5 hours ago