Movie News

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2. తమన్ దీని గురించి ఆ మధ్య కొన్ని ఈవెంట్లలో తెగ ఊరించాడు. సెప్టెంబర్ 2 దాకా వెయిట్ చేయండి, మీకు అదిరిపోయే కానుక వస్తుందని అభిమానులకు ఆశ కలిగించాడు. మరీ అంత స్థాయిలో కాదు కానీ ఉన్నంతలో ఒక డీసెంట్ అప్డేట్ దర్శకుడు సుజిత్ నుంచి వచ్చింది. ఓజి యునివర్స్ ని మరింత విస్తరించబోతున్నట్టు ఒక వీడియో ద్వారా చెప్పేశారు.

ఆ మధ్య తను, తమన్ ఇద్దరూ పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక డిస్కషన్ చేసిన సంగతి తెలిసిందే. దాని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు దాని క్లిప్పులనే జోడించి ఓజి 2 ఎలా ఉండబోతోందో చిన్న ఐడియా ఇచ్చారు. జపాన్ సమురాయ్ యోధుడిగా పవన్ ని చూపించడం, సుభాష్ చంద్ర బోస్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్ల రెఫరెన్సులు పెట్టడం, ఓజికి పని చేసే అందరికీ లైఫ్ టైం మెమరీ కావాలనే సంకల్పాన్ని పవన్ వెలిబుచ్చడం ఇందులో ఉన్నాయి.

సరే ఇదంతా చూసి ఓజి 2 త్వరలోనే సెట్స్ పైకి వెళ్లపోతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే సుజిత్ ముందు నానితో బ్లడీ రోమియో పూర్తి చేయాలి. ఇంకా స్టార్ట్ కాలేదు కానీ ఒక్కసారి మొదలుపెట్టాక నాన్ స్టాప్ షూటింగ్ చేసేందుకు పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. అధిక భాగం విదేశాల్లో జరుగుతుంది కాబట్టి ఇబ్బందేం లేదు. అదయ్యాక ఓజి 2 పనులు ఉంటాయి. ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకుంటున్న పవన్ తిరిగి వచ్చాక చాలా విషయాల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఎలా చూసుకున్నా 2027 వేసవి కన్నా ముందు ఓజి 2 సెట్స్ పైకి వెళ్లకపోవచ్చు. అంటే సినిమా విడుదల 2028లో ఉంటుంది. సో కొంచెం ఎక్కువ వెయిటింగ్ తప్పేలా లేదు. హెల్త్ దృష్ట్యా ఇంతకు ముందు అంత వేగంగా పవన్ కళ్యాణ్ పరుగులు పెట్టకపోవచ్చు. సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసుకున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా ప్రస్తుతం పెండింగ్ లోనే ఉంది. 2029 ఎన్నికలు వచ్చేలోగా పవన్ కళ్యాణ్ నుంచి కనీసం రెండు సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

This post was last modified on September 2, 2026 6:30 pm

Share

Recent Posts

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

2 hours ago

కర్ణుడిగా లారెన్స్… రిస్క్ అవుతుందా

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…

2 hours ago

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

3 hours ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

7 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

7 hours ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

7 hours ago