తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు మీదకు లాగింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన తండ్రి డి. శ్రీనివాస్ ఉపయోగించిన కారును జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ బోగ శ్రావణికి గిఫ్ట్ గా ఇవ్వడంతో బీజేపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గు మన్నాయ్. ఎంపీ ఏకపక్ష వ్యవహారిస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఏకంగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతుంది.
ఇంతకూ ఏమి జరిగిందంటే…రాఖీ పండుగ రోజున జగిత్యాల బీజేపీ ఇన్చార్జీ బోగా శ్రావణి ఎంపీ అరవింద్ కు రాఖీ కట్టారు. సోదరభావంతో ఆమెను ఆశీర్వదించిన అరవింద్ తన తండ్రి డి. శ్రీనివాస్ ఉపయోగించిన కారును బహుకరించారు. ఇది నిజామాబాద్ బీజేపీలో చిచ్చు రాజేసింది. స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ కోసం లాఠి దెబ్బలు తిని కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కనీసం ఒక మోటారు బైక్ కూడా కొనివ్వని ఎంపీ అరవింద్ పార్టీలో నిన్నగాక మొన్న చేరిన వారికి ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం ఏంటని భగ్గుమన్నారు.
దాంతో పాటు పార్టీ పదవులు, ఎంపీ ఏకపక్ష నిర్ణయాలపై ఇన్నాళ్లు అసంతృప్తిగా వున్న నాయకులంతా ఏకమయ్యారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సురభి ఫాంహౌస్ లో సుమారు 150 నుంచి 200 మంది సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్లు, కౌన్సిలర్లు, మండల నాయకులు సమావేశమయ్యారు. కోరుట్ల, ధర్మపురి, జగిత్యాలకు చెందిన ఈ నాయకులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. పార్టీ నిబంధనలను తుంగలోకి తొక్కి ఎంపీ అరవింద్ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారని, పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి సొంత అనుచరులను పార్టీ పదవుల్లో నియమిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. పార్టీ పట్టణ, మండల కమిటీ సభ్యుల అభిప్రాయాలను తీసుకోకుండా యాదగిరి బాబును జిల్లా అధ్యక్షుడిగా నియమించడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించడంతో ఆ పార్టీ నాయకులు ఉలిక్కి పడ్డారు.
అయితే తెలంగాణాలో ఇప్పుడంతా ఈ శ్రావణి ఎవరని చర్చించుకుంటున్నారు. శ్రావణి అంతకుముందు బీఆర్ఎస్ లో వున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా చేశారు. అప్పటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో విభేదాలు ఏర్పడ్డాయి. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఒకదశలోతనను అవమానిస్తున్నారంటూ మీడియా ముందు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో బీఆర్ఎస్ కు, మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాం రాం చెప్పి బీజేపీలో చేరారు. 2023లో జగిత్యాల ఎమ్మెల్యేగా పనిచేసి ఓటమి చెందారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రావణి మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని త్యజించి వచ్చి బీజేపీలో చేరిందని ఎంపీ అరవింద్ చెబుతున్నారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ బీజేపీకి 3,4 వేల ఓట్లు మాత్రమే వచ్చేవని , శ్రావణి ప్రభావంతో 45 వేల ఓట్లు వచ్చాయని చెప్పారు. ఆ కారు మా నాన్న ది, ఆయన చనిపోయాక మూలన పడటం ఇష్టం లేక ఆ అమ్మాయికి బహుమతిగా ఇచ్చాను, దానికే పార్టీ నాయకులు ఏడ్చి చస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా పార్టీ అధిష్టానం మాత్రం ఇదేం లొల్లిరా బాబు అని తలపట్టుకుంటుంది. అసలే పార్టీలో నాయకుల మధ్య సమన్వయం లేక అల్లాడిపోతుంటే మధ్యలో ఈ కారు గోలేందని చిరాకు పడుతున్నారు.
This post was last modified on September 2, 2026 7:05 pm
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…
సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…