Movie News

దర్శకుడిని దాచి పెడుతున్న దేవరాయ

ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం నిత్యం చూస్తూనే ఉన్నాం. వీళ్ళ సంగతి ఇలా ఉంటే శాండల్ వుడ్ హీరోలు మన టాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చేతులు కలుపుతున్నారు. కిచ్చ సుదీప్ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోయే ప్యాన్ ఇండియా మూవీ దేవరాయ ఇవాళ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. వచ్చే ఏడాది 2027డిసెంబర్ విడుదలని అఫీషియల్ గా ప్రకటించింది.

ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ గట్రా చూస్తుంటే శ్రీ కృష్ణదేవరాయల కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. విజయనగర సామ్రాజ్యాధినేతగా గతంలో ఈ పాత్రని అతి కొద్దిమంది హీరోలు మాత్రమే చేశారు. కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్, తెలుగులో నటసార్వభౌమ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ మెప్పించిన సంగతి తెలిసిందే. దేవరాయ పేరు చెప్పగానే మనకు వెంటనే మహామంత్రి తిమ్మరుసు, ఆదిత్య 369 లాంటి క్లాసిక్స్ గుర్తుకు వస్తాయి.

అంతా బాగానే ఉంది ఇంతకీ దేవరాయ దర్శకుడిని ఎక్కడా రివీల్ చేయకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ సుదీపే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడా లేక ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదానేది సస్పెన్స్ గానే ఉంది. విడుదల స్లాట్ చూస్తే ఇంకా పదిహేను నెలల సమయముంది. సో మెల్లగా టైం చూసుకుని చెబుతారేమో. మొన్న జనవరిలో రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న నిర్మాత టిజి విశ్వప్రసాద్ తిరిగి ఇటీవలే యాక్టివ్ అయిపోయారు.

జాంబీ రెడ్డి సీక్వెల్ ని ఇటీవలే కాన్సెప్ట్ టీజర్ రూపంలో ప్రకటించారు. ఇప్పుడు దేవరాయ వంతు వచ్చింది. చూస్తుంటే మళ్ళీ స్పీడ్ పెంచినట్టే ఉంది. కాకపోతే ఎప్పుడో పూర్తయిన గరివిడి లక్ష్మి లాంటివి ఎప్పుడు రిలీజ్ అవుతాయో అంతు చిక్కడం లేదు. ఇక దేవరాయ విషయానికి వస్తే కంటెంట్ కరెక్ట్ గా పడితే తెలుగులోనూ వర్కౌట్ చేసుకోవచ్చు. గతంలో ఇదే టైటిల్ తో శ్రీకాంత్ ఒక సినిమా చేశారు కానీ పనవ్వలేదు. అయితే సుదీప్ సెలక్షన్ నుంచి మంచి ఫలితమే ఆశించవచ్చు. 

This post was last modified on September 2, 2026 1:54 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

4 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

4 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

6 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

6 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

7 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

7 hours ago