Movie News

ప్యారడైజ్ దుస్తులకు ఖరీదు ఎక్కువే

సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్ లోనే అత్యంత కాస్ట్లీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా మీద విపరీతమైన నమ్మకంతో బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా ఖర్చు పెట్టారు. దానికి తోడు షూటింగ్ జాప్యం, అనుకున్న దాని కన్నా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోవడంతో బయట రకరకాల ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. ఫైనల్ గా రెండు మూడు వాయిదాల తర్వాత ప్యారడైజ్ థియేటర్లలోకి అడుగు పెట్టనుంది.

ఇదిలా ఉండగా ప్యారడైజ్ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ కాస్ట్యూమ్స్ అధికారికంగా అమ్మకాలకు వచ్చాయి. నాని వేసుకున్న ఒరిజినల్ కోట్ జాకెట్ అక్షరాలా 25 వేల రూపాయలు. దీంట్లో నలుపు తెలుపు వేర్వేరుగా రెండు డిజైన్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కొకటి 25 పీసులు మాత్రమే పెట్టారు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేయడం లాంటివి ఉండవు. డిజైనర్ కం తెలుసు కదా దర్శకురాలు నీరజ కోన ఆధ్వర్యంలో ఇవి రూపొందాయి.

మరి బడ్జెట్ అభిమానులకు ఆప్షన్లు లేవా అంటే ఉన్నాయి. టి షర్ట్ 999 రూపాయలు, హెడ్ బ్యాండ్ ఉన్న జడలు 350 రూపాయలు, చేతి బ్యాండ్ 99 రూపాయలు, పోస్టర్లు ఒక్కొక్కటి 149 రూపాయలు చొప్పున ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు. ఒరిజినల్ ఎడిషన్ జాకెట్స్ కావాలంటే మాత్రం కాస్త ప్రియంగా సొమ్ములు చెల్లించాల్సిందే. ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఓజి, శివ, కూలి, కుబేర, డాకు మహారాజ్, బాహుబలి, దేవర లాంటి వాటికీ ఇలా మెర్కెండైజ్ అమ్మారు.

గతంలో దుకాణాల్లో, రోడ్డు మీద ఫుట్ పాతుల్లో ఇలా సినిమాల వస్తువులు, పోస్టర్లు అమ్మేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆన్ లైన్ కావడంతో ఇదో కొత్త వ్యాపార అవకాశాన్ని సృష్టించి ఇచ్చింది. ఫిల్మీ డైజ్ సంస్థతో పెట్టుకున్న టై అప్స్ తో నిర్మాణ సంస్థలు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. కాదేది బిజినెస్ కు అనర్హం అన్న తరహాలో క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ కి ఇలా చేయడంలో తప్పేమి లేదు. దూకుడులో బ్రహ్మానందం అన్నట్టు ఇది వ్యాపారం. 

This post was last modified on September 2, 2026 2:47 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

4 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

4 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

6 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

6 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

7 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

7 hours ago