Movie News

మహేష్ సినిమాలకు కొడుకు రేటింగులు చూసారా

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిల్మోగ్రఫీలో ఎన్నో అద్భుతమైన సినిమాలున్నాయి. అలాగే కొన్ని ఒక మోస్తరుగా ఆడిన చిత్రాలున్నాయి. కొన్ని దారుణమైన డిజాస్టర్లూ ఉన్నాయి. ఆ డిజాస్టర్లలో కొన్నింటి గొప్పదనాన్ని జనాలు తర్వాత గుర్తించి వాటిని ఆదరించారు. కొన్ని సినిమాలను మాత్రం తలుచుకోగానే వామ్మో అనిపిస్తాయి. మొత్తంగా మహేష్ బాబు ఫిల్మోగ్రఫీలో ప్రతి సినిమా విషయంలోనూ అభిమానులకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది.

మరి మహేష్ తనయుడికి ఈ చిత్రాల విషయంలో ఎలాంటి ఒపీనియన్ ఉందన్నది ఆసక్తికరం. అతను సినీ ప్రియులు ఇష్టంగా వాడే ‘లెటర్ బాక్స్’లోకి అడుగు పెట్టడమే కాదు.. తన తండ్రి చిత్రాలతో పాటు వేరే వాటికీ రేటింగ్స్ ఇచ్చిన విషయం కొంత ఆలస్యంగా అభిమానుల దృష్టిలో పడింది. తన అకౌంటును కనిపెట్టేసి.. వివిధ చిత్రాలకు గౌతమ్ ఇచ్చిన రేటింగ్స్ గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ సినిమాల్లో వేటికి ఎలాంటి రేటింగ్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం.

మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా, ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్‌గా కూడా నిలిచిన ‘పోకిరి’తో పాటు అతి పెద్ద డిజాస్టర్ అయిన ‘1 నేనొక్కడినే’ సినిమాకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు గౌతమ్. ‘1 నేనొక్కడినే’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. పైగా ఇందులో గౌతమ్ ఒక కీలక పాత్ర పోషించాడు. అందుకే ‘పోకిరి’ లాంటి మెగా బ్లాక్‌బస్టర్ సరసన దీన్ని నిలబెట్టాడు.

ఐతే ఒకప్పుడు నాన్-బాహుబలి హిట్‌గా నిలిచిన ‘శ్రీమంతుడు’కు మాత్రం గౌతమ్ 3 స్టార్ రేటింగే ఇచ్చాడు. మహర్షికి కూడా అంతే. ‘ఖలేజా’ డిజాస్టర్ అయినప్పటికీ దానికి 3.5 స్టార్స్ ఇచ్చాడు. గౌతమ్ అతి తక్కువగా సింగిల్ రేటింగ్ ఇచ్చిన చిత్రాలు.. బ్రహ్మోత్సవం, ఆగడు. సర్కారు వారి పాట, నిజం, వంశీ, నాని చిత్రాలకు 2 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.

గుంటూరు కారం, సరిలేరు నీకెవ్వరు, స్పైడర్ చిత్రాలకు 2.5 స్టార్స్ ఇచ్చాడు మూవీకి 2.5 స్టార్స్ పడ్డాయి. ఒక్కడు, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలకు 4.. టక్కరి దొంగ, రాజకుమారుడు చిత్రాలకు 3 రేటింగ్ ఇచ్చాడు. ఇక లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్‌కు గౌతమ్ కేవలం 0.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

This post was last modified on September 2, 2026 9:31 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

4 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

4 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

6 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

6 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

7 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

7 hours ago