Movie News

యష్ చేసిన ఖరీదైన పొరపాటు

ఒక పెద్ద సక్సెస్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం కోసం స్టార్లు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి ఖరీదైన మూల్యం చెల్లించేలా చేస్తాయి. లేదా వాళ్లే ఆ బ్లాక్ బస్టర్ హ్యాంగోవర్ లో పడిపోయి, ప్రేక్షకులు మమ్మల్ని ఇలాగే చూడాలని కోరుకుంటున్నారని భ్రమపడి ఎంచుకునే కథలు తీవ్ర ఫలితాలను ఇస్తాయి. శివ తర్వాత నాగార్జునకు పది ఫ్లాపులు ఉన్నాయి. మగధీర లాంటి హై స్కేల్ మూవీ తర్వాత రామ్ చరణ్ తో ఆరెంజ్ చేయడమే నిర్మాత నాగబాబుని నష్టాల్లో ముంచేసింది. బాహుబలి తర్వాత సాహో కూడా ఇదే క్యాటగిరీనే.

తాజాగా యష్ పెద్ద డిఫెన్స్ లో పడిపోయాడు. నాలుగు సంవత్సరాలు ఒకే సినిమా మీద ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ కోసం రెండేళ్లు కేటయించాడు. రీ షూట్లు, వాయిదాలు, కోర్టు కేసులు, నిర్మాత కోట్ల డబ్బు సంవత్సరాల తరబడి బ్లాక్ అయిపోవడం లాంటి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని థియేటర్లకు తీసుకొచ్చాడు. అంతా తానై నిలబడ్డాడు. తీరా చూస్తే బెనిఫిట్ షో నుంచే హాండ్సప్ అనే టాక్ వచ్చేసింది. హిందీ కన్నడలో కాస్త డీసెంట్ గా ఉన్నా తెలుగు సహా మిగిలిన భాషల్లో చేతులు ఎత్తేసింది.

ఇక్కడ యష్ చేసిన ఖరీదైన పొరపాటు గురించి మాట్లాడుకోవాలి. కెజిఎఫ్ తనకు ప్యాన్ ఇండియా మార్కెట్ తెచ్చింది. నిజమే. అంత మాత్రాన ఆడియన్స్ పదే పదే తనను రాఖీ భాయ్ లా మనుషులను చంపుతూ పోయే గ్యాంగ్ స్టర్ పాత్రల్లోనే చూడాలని కోరుకోవడం లేదు. కమర్షియల్ ఫార్ములా వదలకుండానే కొత్త కథలను ట్రై చేయొచ్చు. కానీ అదే బారుడు గెడ్డంతో మెషీన్ గన్లను పెట్టుకుని, మితిమీరిన రొమాన్స్ పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ.

కొత్త జానర్లు వెతకాలి. ఆడియన్స్ పల్స్ తెలుసుకోవాలి. రొటీన్ కథలు చేసి చేసి అరడజను డిజాస్టర్లు చూసిన తర్వాత రవితేజ అయ్యప్ప మాల వేసుకుని రెండు భక్తి పాటలున్న ఒక డీసెంట్ క్రైమ్ డ్రామాలో నటిస్తే కాసుల వర్షం కురుస్తోంది. ప్రభాస్ కూడా అన్నీ సలార్ లాంటివే చేయడం లేదు. ఫౌజీలో బ్రిటిష్ సైనికుడిగా, స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. యష్ ఈ కోణంలో ఆలోచిస్తే భాషతో సంబంధం లేకుండా తనకు కిరీటం ఇవ్వడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. 

This post was last modified on August 30, 2026 4:23 pm

Share

Recent Posts

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్.. చిరు మాస్టర్ ప్లాన్

వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…

57 minutes ago

మేనల్లుడి స్థానంలో బొత్సా కూతురు

విజయనగరం జిల్లా రాజకీయాలు మొత్తం బొత్సా కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి. ప్రధానంగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో వారం రోజుల్లోనే బొత్సా…

3 hours ago

న్యూడ్ సీన్లు చేశానని తేలిగ్గా తీసుకుంటున్నారు

ఇండియన్ సినిమాల్లో ఎంతో బోల్డ్‌గా నటించే కథానాయికల్లో రాధికా ఆప్టే ఒకరు. ఆమె కెరీర్ ఆరంభంలోనే కొన్ని చిత్రాల్లో న్యూడ్‌గా…

3 hours ago

రవితేజ వాడుతున్న దీపం ఫార్ములా

పెద్దల సామెత ఒకటి ఎప్పటికీ ఎవర్ గ్రీన్. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఊరికే చెప్పలేదు. ఇప్పటికీ ఎందరో దాన్ని పాటిస్తూనే…

3 hours ago

రీమేక్ సినిమాలో ఫ్రీగా నటిస్తానన్న విజయ్

గత కొన్నేళ్లలో తమిళం నుంచి వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘మహారాజ’ ఒకటి. నిథిలన్ స్వామినాథన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన…

4 hours ago

దానం ఆశించిందేంటి? జ‌రిగిందేంటి?

తెలంగాణ‌లోని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ప‌ద‌విని కోల్పోయారు. ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 10 మేర‌కు ఆయ‌న ప‌ద‌విపై…

5 hours ago