Movie News

యాపిల్ చార్జర్ కోసం షూటింగ్ ఆపేశాడా?

ఓ హారర్ థ్రిల్లర్ కథ కోసం హీరోను వెతుకుతున్న సమయంలో ఓ యువ నటుడి పేరు వచ్చిందట. ఒకప్పుడు హిందీ మార్కెట్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకు ఇప్పటికీ ఓ మోస్తరు మార్కెట్ ఉంది. బడ్జెట్ కూడా ఎక్కువే కావడంతో తెలిసిన హీరో ఉంటే బిజినెస్‌కు ఉపయోగపడుతుందని నిర్మాతల టీమ్‌లో కొందరు అనుకున్నారట. కానీ అతనితో గతంలో పని చేసిన ఒక వ్యక్తి మాత్రం వెంటనే మరో మాట చెప్పాడట. హీరో రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతాడని కాదు. లొకేషన్‌లో ఎప్పుడు ఏ డిమాండ్ పెడతాడో చెప్పలేమని అతను చెప్పినట్లు సమాచారం. 

షూట్ కోసం బ్రాండెడ్ షూస్, డ్రెస్సులు కావాలని అడగడం, వాటిని తర్వాత తనతో తీసుకెళ్లడం లాంటివి కూడా జరిగాయని గుర్తు చేశాడట. అందులో యాపిల్ చార్జర్ ఘటన మాత్రం మరీ వింతగా ఉందట. ఒక రోజు షూటింగ్ లొకేషన్‌లో కొత్త యాపిల్ చార్జర్ లేకపోవడంతో హీరో పని ఆపేశాడని చెప్పారట. అక్కడున్న వాళ్ల దగ్గర మరో చార్జర్ ఉన్నా వాడలేదట. కారులో ఉన్న వాడిన చార్జర్ ఇచ్చినా ఒప్పుకోకుండా, కొత్తది కొనుక్కొచ్చే వరకు షూటింగ్ ముందుకు వెళ్లలేదని ఆ వ్యక్తి చెప్పినట్లు కథనం.

ఇలాంటి విషయాలు విన్నాక నిర్మాతలు హీరో మార్కెట్ కంటే షూటింగ్ రోజుల గురించే ఎక్కువగా ఆలోచించారట. రెమ్యునరేషన్‌ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినా ఓకే కానీ, ప్రతి రోజు లొకేషన్‌లో కొత్త టెన్షన్ వద్దని అనుకున్నారట. చివరకు ఆ హీరో పేరును అక్కడితో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొత్త దర్శకుడితో చేయాల్సిన ప్రాజెక్ట్. కథ బాగుందని నిర్మాతలు భావిస్తున్నా బడ్జెట్ మాత్రం చిన్నది కాదట. అలాంటి సమయంలో షూటింగ్ ఒక్క రోజు ఆగినా ఖర్చు పెరుగుతుంది. అందుకే హీరోకు మార్కెట్ ఉండటం ఒక్కటే సరిపోదని, పని చేసే విధానం కూడా తమకు సెట్ కావాలని నిర్మాతల టీమ్ భావించినట్లు సమాచారం.

This post was last modified on August 30, 2026 4:56 pm

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

2 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

4 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

5 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

5 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

6 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

6 hours ago