Movie News

టాక్సిక్ పరిస్థితి ఎలా ఉంది గురూ

భారీ అంచనాల మధ్య కెజిఎఫ్ ని మించి ఉంటుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న టాక్సిక్ రిలీజ్ రోజు ఉదయం నుంచే విమర్శల పర్వంలో మునిగి తేలుతోంది. మొదటి వీకెండ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు నిరాశ మిగులుస్తూ అంతంత మాత్రం ఆక్యుపెన్సీలతో భారంగా నెట్టుకొస్తోంది. కనీసం యావరేజ్ టాక్ వచ్చినా ఏదోలా యష్ నెట్టుకొచ్చేవాడు కానీ మరీ ఇంత తీవ్రమైన నెగటివ్ టాక్ తో ఎదురీదలేక టీమ్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు సైతం ఆపేసింది.

వసూళ్ల నెంబర్లు, లాభ నష్టాలు అనుకున్న దానికన్నా ముందుగానే తేలేలా ఉన్నాయి. రెండో వారంలో మొక్కుబడి కొనసాగింపు తప్పించి హోల్డ్ చేయడం కష్టమని ట్రేడ్ స్పష్టం చేస్తోంది. కర్ణాటకలో కొంచెం బెటర్ గా ఉండగా, హిందీ ఆడియన్స్ మద్దతు మొదటి రెండు మూడు రోజులు దక్కడం దారుణమైన అంకెలు రాకుండా కాపాడింది. అయితే అది చాలడం లేదు. వారాంతం వచ్చేలోపే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా డ్రాప్ ఎక్కువగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు.

మూడు గంటల పదిహేను నిమిషాల కంటెంట్ లో కనీసం ఒక ముప్పై నలభై శాతం బాగున్నా ఇంత నెగటివిటీ వచ్చేది కాదేమో. దర్శకురాలు గీతూ మోహన్ దాస్, యష్ కలిసి తయారు చేసిన స్క్రిప్ట్ కనీసం ఫ్యాన్స్ అంచనాలను సైతం మ్యాచ్ చేయలేకపోతోంది. టాక్సిక్ మీద వచ్చిన ప్రతికూల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కన్నడ స్టార్లు ట్విట్టర్ లో నడుం బిగించారు. ఉపేంద్ర, రిషబ్ శెట్టి, ఇడియట్ హీరోయిన్ రక్షిత్ మొదలైనవాళ్ళు యష్ సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.

వీటి వల్ల ప్రయోజనం అంతగా ఉంటుందని చెప్పలేం. జనాలకు ఆల్రెడీ తీర్పు స్పష్టంగా అర్థమైపోయాక ఎందుకు బాలేదో తెలుసుకునేందుకు టికెట్లు కొనరు. ఇంకో విచిత్రం ఏమిటంటే తెలుగు యువత కావాలనే డిజాస్టర్ టాక్ ప్రచారం చేస్తోందని, ఇకపై మేము కూడా టాలీవుడ్ సినిమాలను చూడమని కొందరు కన్నడ నెటిజెన్లు కామెడీ చేస్తున్నారు. అయినా బెంగళూరులో టాక్సిక్ కన్నా ఇరుముడి బుకింగ్సే బాగున్నాయి. విభేదాలు ఎన్ని ఉన్నా ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంట్ ఒక్కటే. 

This post was last modified on August 30, 2026 6:49 pm

Share

Recent Posts

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

5 minutes ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

6 minutes ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

1 hour ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

5 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

6 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

10 hours ago