బాక్సాఫీస్ వద్ద ఈసారి ఆసక్తికరమైన క్లాష్ నెలకొనబోతోంది. నాగార్జున వందో సినిమా కింగ్ 100 విడుదల తేదీని ఇవాళ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 24 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అఫీషియల్ గా చెప్పేశారు. నాగ్ కు బాగా కలిసి వచ్చిన నెల ఇది. మన్మథుడు, మాస్ లాంటి సూపర్ హిట్స్ ఈ టైంలో వచ్చినవే. అందుకే అనవసరంగా సంక్రాంతి పోటీలో దిగి వసూళ్లు పంచుకునే అవసరం లేకుండా సోలోగా వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
సరిగ్గా అదే రోజు షారుఖ్ ఖాన్ కింగ్ విడుదలవుతోంది. అయితే ఇది ఇప్పుడు డిసైడ్ చేసింది కాదు. ఎన్నో నెలల క్రితమే క్రిస్మస్ కు రావాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు కింగ్ 100 పోటీకి రావడం ఉత్తరాదిలో ఇబ్బంది లేదు కానీ, షారుఖ్ కి మార్కెట్ పరంగా మంచి పట్టు ఉన్న నైజామ్ లో సమస్య వస్తుంది. పైగా ముందు వారం ఎవెంజర్స్ డూమ్స్ డే కూడా వచ్చి ఉంటుంది కాబట్టి స్క్రీన్ కౌంట్ పరంగా పంపకాలు టైట్ గా ఉంటాయి. కింగ్ 100కి సైతం పక్క రాష్ట్రాల్లో ఇదే ప్రాబ్లమ్ తప్పదు. బాలయ్య 111 కూడా అదే డిసెంబర్ 24 వస్తుందనే ప్రచారం జోరుగా ఉంది కానీ మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారమైతే లేదు. బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సెట్స్ లో అడుగు పెట్టాక ఆ డేట్ ని అందుకునేలా షూటింగ్ వేగవంతం చేయగలరా లేదానే క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా నిర్ధారణగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మరోపక్క క్లాష్ పట్ల బాలీవుడ్ జనాలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా రెండు టైటిల్స్ ఒకేలా ఉండటం మరో విచిత్రం. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్ ముందు సుహానా ఖాన్ ని లీడ్ రోల్ లో పెట్టి తీయాలనుకున్న యాక్షన్ థ్రిల్లర్. షారుఖ్ కి క్యామియో అనుకున్నారు. తర్వాత కథను మార్చేసి తండ్రి కూతుళ్ళకు ప్రాధాన్యం ఉండేలా ట్రీట్ మెంట్ ఛేంజ్ చేసుకున్నారు. షారుఖ్ టైటిల్ రోల్ కావడంతో అంచనాలతో పాటు బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది.
ఇక కింగ్ 100 మీద పాజిటివ్ వైబ్స్ అయితే బాగానే ఉన్నాయి. దర్శకుడు రా కార్తీక్ కి ఇక్కడ ఎలాంటి బ్రాండ్ లేకపోయినా టీజర్ లో చూపించిన స్టయిలిష్ మేకింగ్ అంచనాలు రేపింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో పాటు యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఆసక్తికరంగానే ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓవర్సీస్ లో మటుకు కింగ్ వర్సెస్ కింగ్ 100 ఖచ్చితంగా టాపిక్ అవుతుంది. డామినేషన్ షారుఖ్ దే ఉండొచ్చేమో కానీ టాక్ బాగా వస్తే మటుకు నాగ్ కూడా సత్తా చాటే అవకాశం లేకపోలేదు.
This post was last modified on August 29, 2026 9:47 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…