యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే అతను అక్కడి ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాడు. వారి అభిరుచికి తగ్గ క్లాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ప్రయోగాత్మక చిత్రాలు చేయడం ద్వారా మార్కెట్‌ను పెంచుకున్నాడు. యుఎస్‌లో మిలియన్ డాలర్ మార్కు అన్నది అతడికి కేక్ వాకే అయిపోయింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ కూడా సాధ్యమవుతున్నాయి.
ఐతే తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’తో తన మార్కెట్‌ను ఇంకో స్థాయికి తీసుకెళ్లడానికి నాని గట్టి ప్లానింగ్‌తోనే బరిలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమాను రూ.200 కోట్ల క్లబ్బులో నిలబెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్‌లో ఉన్న అంచనాలను బట్టి చూస్తే అదేం కష్టం కాదనే అనిపిస్తోంది. సినిమాకు ఒక మోస్తరు టాక్ వచ్చినా కలెక్షన్ల మోత మోగిపోవడం ఖాయం.
ఇక యుఎస్‌లో ‘ది ప్యారడైజ్’ను రిలీజ్ చేస్తున్న ప్రత్యంగిర సినిమాస్.. టికెట్ల ధరల విషయంలో వ్యూహాత్మకమైన అడుగు వేసింది. మామూలుగా ఇక్కడ క్రేజున్న సినిమాలకు డిమాండుకు తగ్గట్లుగా రేట్లు పెంచేస్తుంటారు. ప్రిమియర్స్‌కు 25-30 డాలర్ల మధ్య రేటు పెట్టేస్తుంటారు. నార్మల్ షోలకు 20-25 డాలర్ల మధ్య రేటు ఉంటుంది. ‘ది ప్యారడైజ్’కు ఉన్న హైప్ దృష్ట్యా దీనికీ రేట్లు అదే రేంజిలో ఉంటాయని ట్రేడ్ అంచనా వేసింది. కానీ ప్రత్యంగిర సంస్థ కొంచెం రీజనబుల్‌గానే రేట్లు పెట్టింది.
నార్మల్ షోలకు 17 డాలర్లు, ప్రిమియర్లకు 20 డాలర్లు రేటు పెట్టింది. స్పెషల్ థియేటర్లకు మాత్రం 5 డాలర్లు రేటు ఎక్కువ. ఇది ప్రేక్షకులకు ఎంకరేజింగ్‌గా అనిపించే రేట్లే. సినిమాకు మంచి హైప్ ఉండగా.. రేట్లు రీజనబుల్‌గా ఉండడంతో ప్రి సేల్స్ గట్టిగా జరిగే అవకాశముంది. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబరు 24న రిలీజ్ కానుండగా.. నాలుగు వారాల ముందే ప్రి సేల్స్ మొదలుపెడుతున్నారు. ఈ రేట్లు, సినిమా హైప్‌ను బట్టి చూస్తే ప్రిమియర్స్‌తోనే 1 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెడితే ఆశ్చర్యం లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఫైనల్ నంబర్ 3-4 మిలియన్ల మధ్య ఉండొచ్చు.
This post was last modified on August 28, 2026 10:13 pm
కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…