Movie News

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గ్రేటే

టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. తెలుగు ఆడియన్స్ టేస్ట్, అభిరుచిని తక్కువ చేస్తూ కొందరు శాండల్ వుడ్ ఫ్యాన్స్ చేస్తున్న గోల మహా విచిత్రంగా ఉంది. కమర్షియల్ ఫైట్లు, ఐటెం సాంగులు ఉంటేనే టాలీవుడ్ జనాలకు నచ్చుతాయని అర్థం వచ్చేలా రకరకాల పోస్టులతో రెచ్చగొడుతున్న వైనం కనిపిస్తోంది. అయితే ప్రాక్టికల్ గా పచ్చిగా చెప్పాలంటే ఇందులో వీసమెత్తు నిజం లేదు.

ఎందుకంటే ఇతర భాషల ప్రేక్షకుల గురించి మనం కామెంట్ చేయలేం కానీ మన మూవీ లవర్స్ గురించి గర్వంగా చాటుకోవచ్చు. అసలు ప్రాంతీయ భేదాలే లేకుండా కంటెంట్ బాగుంటే చాలు కలెక్షన్లు కుమ్మరించే ప్రేమ మనం కొత్తగా ఇప్పుడు చేయడం లేదు. దశాబ్దాలుగా ఉన్నదే. యాభై ఏళ్ళ క్రితం టి రాజేందర్ కొత్త వాళ్ళతో తీసిన ప్రేమసాగరం ఇక్కడ వంద రోజులు ఆడింది. శంకర్ తీసిన అపరిచితుడు, ఒకే ఒక్కడు, బాయ్స్ తమిళనాడు కంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.

ఎక్కడిదాకో ఎందుకు డిసి, విశ్వనాథ్ అండ్ సన్స్ కు కలెక్షన్లు కురిపించింది ఎవరు. కాంతారలో ఉన్నది మన గ్రామదేవతలు కాదు. అయినా సరే సీక్వెల్ కి టికెట్ రేట్లు పెంచినా సరే ఆదరణ చూపించారు. స్ట్రెయిట్ సినిమాల విషయంలోనూ మనది ఇదే తీరు ఉంటుంది. మాస్ మసాలాల ఊసే లేని బలగం, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటివి డబ్బులు ఎలా తీసుకొచ్చాయి. స్టార్స్ ఉన్నారని కాదు. హృదయాలను కదిలించే కథా కథనాలు బలంగా ఉన్నాయి కాబట్టి.

ఇప్పుడు టాక్సిక్ ని టార్గెట్ చేయడం లాంటివి ప్రత్యేకంగా ఇక్కడి వాళ్లే చేయడం లేదు. ఆ మాటకొస్తే ఓవర్సీస్ లో కన్నడ వెర్షన్ కన్నా తెలుగు వెర్షన్ నెంబర్లే ఎక్కువగా ఉన్నాయి. కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 నెత్తిన బెట్టుకున్నది మర్చిపోతే ఎలా. ఇక్కడ స్టార్ ని బట్టి ట్రీట్ మెంట్ మారదు. భోళా శంకర్ ని బాబోయ్ అన్నవాళ్ళే మన శంకరవరప్రసాద్ కి మూడు వందల కోట్లు ఇచ్చారు. ఓజికి వెయ్యి రూపాయలు పెట్టిన ఫ్యాన్ ఉస్తాద్ భగత్ సింగ్ కి దండం పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పేజీల కొద్దీ ఉదాహరణలు వస్తాయి. కాబట్టి దేశం మొత్తంలో భాషా భేదం లేకుండా అన్ని సినిమాలని ప్రేమించేవాళ్లలో మొదటి పేరు తెలుగు ప్రేక్షకులదే. 

This post was last modified on August 29, 2026 9:29 am

Share

Recent Posts

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

8 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

37 minutes ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

10 hours ago