బీజేపీ అడ్డాగా చెప్పుకునే రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ లో స్థానిక ఎన్నికల ఫలితాలు కమలనాధులకు దిమ్మతిరిగేలా వచ్చాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల్లో దాదాపుగా ఘోరమైన ఫలితాలు ఎదుర్కుంటోంది. బీజేపీ అధిష్టానానికి రాజస్థాన్ లో ఓటమి చెందిన బాధకంటే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే ఎక్కువగా బాదిస్తుంది. రెండు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీ తాజాగా జరిగిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో ఘోర ఓటమి మూటకట్టుకోవడం రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది.
రాజస్థాన్లో మొత్తం 7,543 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా 7,393 పంచాయతీ ఎన్నికలు ఫలితాలను వెల్లడించారు. ఇందులో అధికార బీజేపీ 2,181 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 3701 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. మిగిలిన స్థానాల్లో ఆర్‌ఎల్‌పీ , బీఏపీ , సీపీఐ(ఎం), బీఎస్పీ, స్వతంత్రులు గెలుచుకున్నారు. 1,275 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగాయి. అందులో 981 స్థానాల ఫలితాలు వెల్లడించారు. అధికార బీజేపీ 301 స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ 599 స్థానాలలో గెలుపు దక్కించుకొని పైచేయి సాధించింది.
రాష్ట్రంలోని 37 జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. 33 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. అంటే రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో కాంగ్రెస్ దుమ్ము రేపింది. అధికారంలో వున్న బీజేపీ అజ్మీర్, బలోత్రా, సలంబర్, ఉదయ్‌పూర్ జిల్లాల్లో మాత్రమే తన ఉనికి చాటుకుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా భరత్‌పూర్, ఆయన సొంత నియోజకవర్గం సంగనేర్‌తో పాటు మంత్రులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నియోజకవర్గమైన ఝోట్వారా, ఝాబర్ సింగ్ ఖర్రా నియోజకవర్గమైన సీకర్ వంటి ప్రముఖ నేతల ఇలాకాల్లో బీజేపీ అభ్యర్థులు, వారి మంత్రుల కుటుంబ సభ్యులు చిత్తుగా ఓడిపోవడంతో కమలం కంటిమీద కునుకు లేకుండా చేసింది.
రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తుంది. మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. దాంతో ఇప్పుడు వచ్చిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రమాద ఘంటికలు మోగించాయని చెప్పొచ్చు. మతం గురించి రెచ్చగొట్టే మాటలు చెప్పడం మినహా బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని గ్రామీణ ప్రజలు ఆగ్రహంగా వున్నారు. ఆ ఆగ్రహన్ని ఓటు రూపంలో వ్యక్తం చేశారన్న అభిప్రాయలూ వ్యక్తం అవుతున్నాయి. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీకి నూకలు చెల్లినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రాజస్థాన్ వరకే పరిమితం కావడం లేదు. దేశం మొత్తం బీజేపీ బలహీనపడుతుందన్న సంకేతాలు ఇచ్చిందని మేధావులు చెబుతున్నారు.
This post was last modified on November 20, 2026 10:40 pm
ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ చూసిన నితిన్ ను గత కొన్నేళ్లుగా వరస డిజాస్టర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొత్త వాళ్లకు…
మహాభారత యుద్ధం చివరి ఘట్టానికి ముందు అభిమన్యుడు కౌరవులు పన్నిన పద్మవ్యూహంలోకి వెళ్ళి వీరోచితంగా పోరాడతాడు. అయితే లోపలికి వెళ్లడమే…
రియాలిటీ అని ఏ ముహూర్తంలో టైటిల్ పెట్టుకుని స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడో దానికి తగ్గట్టే హీరో కిరణ్ అబ్బవరం…
రాజకీయ నాయకుల ప్రసంగాలు సాధారణంగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ భవిష్యత్తు చుట్టూనే సాగుతుంటాయి. కానీ ఆస్ట్రేలియాలో ఓ…
నేచురల్ స్టార్ నానికి హీరోగా కంటే నిర్మాతగా ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది అంటే అతిశయోక్తి కాదు. తాను హీరోగా నటించినా,…
ఓవైపు డబ్బింగ్ సినిమాలేమో ఒక్కొక్కటిగా దున్నేస్తున్నాయి. తెలుగు సినిమాల కంటెంట్ ఏమో వీక్‌గా ఉంటోంది. అవిప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం లేదు.…