Movie News

పేరుకు తగ్గ పని చేసిన రియాలిటీ

రియాలిటీ అని ఏ ముహూర్తంలో టైటిల్ పెట్టుకుని స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడో దానికి తగ్గట్టే హీరో కిరణ్ అబ్బవరం చాలా వేగంగా సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు. కేవలం యాభై అయిదు వర్కింగ్ డేస్ లో గుమ్మడికాయ కొట్టడమంటే మాటలు కాదు. డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ఫిక్స్ అయిన కిరణ్ వాయిదా ప్రసక్తే లేకుండా ఫస్ట్ కాపీ సిద్ధం చేయడానికి రెడీ అయిపోయాడు. పోటీలో ఉన్న కింగ్ 100, దాదా పెద్ద హీరోలవి అయినా భయపడటం లేదు.

ఇక్కడ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణముంది. చాలా మంది టయర్ 2, 3 హీరోలు ప్యాన్ ఇండియా మోజులో పడి వరల్డ్ బిల్డింగ్ కథల వైపు మొగ్గు చూపుతున్నారు. అణుగారిన జాతిని ఉద్ధరించే నాయకుడు, మిస్టరిగా మారిన ఊళ్ళో రహస్యాన్ని ఛేదించే హీరో, మాఫియా ప్రపంచంలో గూఢచారి ఇలా పదే పదే ఇదే ఫార్ములా చుట్టూ తిరగడం ఎక్కువైపోయింది. కిరణ్ అబ్బవరం దానికి భిన్నంగా సింపుల్ మిడిల్ క్లాస్ స్టోరీని ఎంచుకోవడం బిజినెస్ పరంగా కలిసి వస్తోంది.

ఇప్పటికే థియేటర్ హక్కులు అనుకున్న దానికన్నా పెద్ద రేట్ కి అమ్ముడుపోయిన రియాలిటీ ఇంకొద్దిరోజుల్లో ఓటిటి డీల్ కూడా క్లోజ్ చేయనుంది. తొలి డైరెక్షన్ సినిమాతోనే కిరణ్ ఇంత సాధించడం ఆషామాషీ అయితే కాదు. ఒకరకంగా ఇప్పుడు దర్శకత్వం చేస్తున్న రామ్, కార్తికేయ, సుధీర్ బాబు లాంటి వాళ్లకు మంచి జోష్ ఇచ్చినట్టే. రియాలిటీ విషయంలో కిరణ్ తీసుకున్న మరో మంచి నిర్ణయం భీమ్స్ సంగీతం. వచ్చిన రెండు పాటలు ఆల్రెడీ మ్యూజిక్ లవర్స్ కు రీచ్ అయ్యాయి.

త్వరలో విడుదల చేయనున్న రఘుకులతిలక రామా మొత్తం హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తుందన్న నమ్మకం టీమ్ లో ఉంది. ఇరుముడిలో మల్లెపూల పల్లకి సాంగ్ ఎంతగా బ్లాక్బ్ బస్టర్ సక్సెస్ లో పాత్ర పోషించిందో తెలిసిందే. ఇప్పుడు కిరణ్ అదే బాట పట్టాడు. ఎక్కువ ధరకు రైట్స్ కొనడంతో పాటు  ఒరిజినల్ సింగర్స్ తోనే పాడించడం గొప్ప ప్లస్ అవుతుంది. డిసెంబర్ చివరి వారంలో బాలయ్య లేదా నాగ్ ఎవరో ఒకరు తప్పుకునే సూచనలున్నాయని వార్తలు వినిపించడం రియాలిటీకి శుభవార్తే. 

This post was last modified on November 20, 2026 10:01 pm

Share

Recent Posts

రాములమ్మని వాడుకోవడం తెలివైన ఐడియా

పాత పాటలను కొత్త సినిమాల కోసం రీమిక్స్ చేసి వాడుకోవడం కొత్త కాదు. దాదాపు అందరు హీరోలు చేశారు. అల్లరి…

2 hours ago

ఇది వింటే ఇక జన్మలో కాపీ కొట్టరు

పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు సాధారణంగా కఠిన తనిఖీలు, నిఘా కెమెరాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తుంటారు. అయితే దక్షిణ కొరియా అధికారులు…

3 hours ago

ఏఐని గుడ్డిగా నమ్మితే ఇలాగే ఉంటుంది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. క్లిష్టమైన పనులను సులభతరం చేస్తూ, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి…

3 hours ago

ఎట్ట‌కేల‌కు ప‌రిటాల వార‌సుడి సుడి తిరిగింది!

ప‌రిటాల ర‌వి, ప‌రిటాల సునీతల వార‌సుడు, టీడీపీ యువ‌నాయ‌కుడు ప‌రిటాల శ్రీరామ్‌.. తాజాగా జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్‌.. చైర్మ‌న్ ఎంపిక‌లో…

3 hours ago

అధికారంలో ఉన్న బీజేపీ కంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు

బీజేపీ అడ్డాగా చెప్పుకునే రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ లో స్థానిక ఎన్నికల ఫలితాలు కమలనాధులకు దిమ్మతిరిగేలా వచ్చాయి. ఆ రాష్ట్రంలోని…

3 hours ago

నితిన్ ఇచ్చింది చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ చూసిన నితిన్ ను గత కొన్నేళ్లుగా వరస డిజాస్టర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొత్త వాళ్లకు…

3 hours ago