Movie News

నితిన్ ఇచ్చింది చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ చూసిన నితిన్ ను గత కొన్నేళ్లుగా వరస డిజాస్టర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినా లేక తనతో ఆల్రెడీ గతంలో పని చేసిన వాళ్లకు ఛాన్స్ అందించినా ఫలితం మాత్రం మారడం లేదు. రాబిన్ హుడ్, తమ్ముడు లాంటివి అగ్ర నిర్మాణ సంస్థల్లో భారీ బడ్జెట్ తో రూపొందినప్పటికీ తీవ్రంగా నిరాశ పరచడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే అలియాస్ రుక్మిణి మీద నితిన్ చూపిస్తున్న కాన్ఫిడెన్స్ మాములుగా లేదు. పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు.

ఇటీవలే జరిగిన బాష్ పార్టీలో మాట్లాడుతూ తన కెరీర్ మొత్తంలో అలియాస్ రుక్మిణి బెస్ట్ మూవీ అవుతుందని అన్నాడు. అంత బాగుంటే సంతోషమే కానీ గతంలో తనకు గొప్ప హిట్లు ఇచ్చిన వాళ్ళను తక్కువ చేయడం ఏమిటనే కామెంట్స్ లేకపోలేదు. ఎందుకంటే టాలీవుడ్ లో ఒక ట్రెండ్ కి కారణమైన జయం, రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై, ఎంటర్ టైన్మెంట్ ప్లస్ మెసేజ్ ప్రాపర్ గా మిక్స్ చేసిన భీష్మలో నితినే హీరో. అవి ఎంత గొప్ప విజయాలు సాధించాయో తెలిసిందే.

వాటిని తోసిరాజని అలియాస్ రుక్మిణి మీద ఇంతగా నమ్మకం పెట్టుకోవడానికి కారణం లేకపోలేదు. ఇది నిర్మాతగా నాని ఓకే చేసిన ప్రాజెక్టు. తక్కువ టైంలో తీసినా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కించారు. దండోరా ఫేమ్ మురళికాంత్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ ద్వారా ఆఫియా హీరోయిన్ గా పరిచయమవుతోంది. లుక్స్ విషయంలో ఆల్రెడీ టాలీవుడ్ జనాల దృష్టిలో పడింది. నటన పరంగా తెలియాలంటే థియేటర్లో సినిమా చూశాక క్లారిటీ వస్తుంది.

అంతా బాగానే ఉంది కానీ అలియాస్ రుక్మిణికి డిసెంబర్ 4నే నాగచైతన్య వృషకర్మ గట్టి పోటీ ఇవ్వనుంది. రెండు వేర్వేరు జానర్లు అయినప్పటికీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. కాకపోతే నితిన్ ఫెయిల్యూర్స్ దృష్ట్యా ఎక్కువ ఎడ్జ్ చైతు వైపు ఉండటాన్ని కొట్టి పారేయలేం. పైగా బడ్జెట్ కూడా దానికి భారీగా ఖర్చు పెట్టారు. ఇటు చూస్తే అలియాస్ రుక్మిణి సింపుల్ గా అయిపోయింది. నాని కూడా 2026లో తన ప్రొడక్షన్ కు ఇది బెస్ట్ మూవీ అవుతుందని ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు. 

This post was last modified on November 20, 2026 10:27 pm

Share

Recent Posts

రాములమ్మని వాడుకోవడం తెలివైన ఐడియా

పాత పాటలను కొత్త సినిమాల కోసం రీమిక్స్ చేసి వాడుకోవడం కొత్త కాదు. దాదాపు అందరు హీరోలు చేశారు. అల్లరి…

2 hours ago

ఇది వింటే ఇక జన్మలో కాపీ కొట్టరు

పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు సాధారణంగా కఠిన తనిఖీలు, నిఘా కెమెరాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తుంటారు. అయితే దక్షిణ కొరియా అధికారులు…

3 hours ago

ఏఐని గుడ్డిగా నమ్మితే ఇలాగే ఉంటుంది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. క్లిష్టమైన పనులను సులభతరం చేస్తూ, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి…

3 hours ago

ఎట్ట‌కేల‌కు ప‌రిటాల వార‌సుడి సుడి తిరిగింది!

ప‌రిటాల ర‌వి, ప‌రిటాల సునీతల వార‌సుడు, టీడీపీ యువ‌నాయ‌కుడు ప‌రిటాల శ్రీరామ్‌.. తాజాగా జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్‌.. చైర్మ‌న్ ఎంపిక‌లో…

3 hours ago

అధికారంలో ఉన్న బీజేపీ కంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు

బీజేపీ అడ్డాగా చెప్పుకునే రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ లో స్థానిక ఎన్నికల ఫలితాలు కమలనాధులకు దిమ్మతిరిగేలా వచ్చాయి. ఆ రాష్ట్రంలోని…

3 hours ago

బాక్సాఫీస్ వ్యూహంలో వెనుదిరిగిన అర్జునుడు

మహాభారత యుద్ధం చివరి ఘట్టానికి ముందు అభిమన్యుడు కౌరవులు పన్నిన పద్మవ్యూహంలోకి వెళ్ళి వీరోచితంగా పోరాడతాడు. అయితే లోపలికి వెళ్లడమే…

3 hours ago