ఒక భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాక.. ఆ సక్సెస్‌ను నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత తనపై పెరిగిన అంచనాలకు తగ్గట్లుగా సినిమాలు చేయలేక వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత చేసిన తొలి చిత్రం ‘సాహో’ విపరీతమైన హైప్ తెచ్చుకున్నప్పటికీ.. చివరికి బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయింది.
మరి ‘కేజీఎఫ్’తో ప్రభాస్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్‌గా అవతరించిన యశ్ పరిస్థితి ఏంటా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఐతే ‘టాక్సిక్’ సినిమాకు మాంచి హైప్ తీసుకురావడం, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగా జరగడం, తొలి రోజు రూ.100 కోట్ల ఓపెనింగ్ ఖాయం కావడంతో యశ్ తక్కువోడు కాదనే చర్చ జరిగింది. సినిమా రిజల్ట్ కూడా బాగుంటే యశ్‌కు తిరుగుండదని అనుకున్నారు.
కానీ ప్రభాస్ లాగే యశ్ కూడా కంగుతిన్నాడు. ‘కేజీఎఫ్’ తర్వాతి సినిమా డిజాస్టర్ దిశగా అడుగులేస్తోంది. కాకపోతే ప్రభాస్‌కు, యశ్‌కు ఒక తేడా ఉంది. ‘సాహో’ డిజాస్టర్ అయింది కానీ.. అది చెత్త సినిమాగా పేరు తెచ్చుకోలేదు. ఇంకా చెప్పాలంటే హిందీ బెల్ట్‌లో ఆ సినిమా బాగా ఆడి బయ్యర్లకు లాభాలు కూడా తెచ్చింది. ఓవరాల్‌గా సినిమా డిజాస్టర్ అయినా.. ప్రభాస్ కెరీర్లో మరకలా ఏమీ మిగల్లేదు.
ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక బాగానే ఉంది కదా అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ సమయానికి విపరీతంగా పెరిగిపోయిన అంచనాలను మ్యాచ్ చేయలేక సినిమా పోయింది కానీ.. ‘సాహో’ బ్యాడ్ మూవీ మాత్రం కాదు. ఈ సినిమా నచ్చిన వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కానీ ‘టాక్సిక్’ను మెచ్చేవాళ్లు మాత్రం వెతికినా కనిపించట్లేదు. సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఎటాక్ మామూలుగా లేదు. యశ్ కష్టపడ్డా సరే.. ఇలాంటి సినిమా చేశాడేంటి అని తిట్టిపోస్తున్నారు జనం. ఇక దర్శకురాలు గీతు మోహన్ దాస్‌ను అయితే మామూలుగా ఆడుకోవట్లేదు.
This post was last modified on August 28, 2026 7:02 pm
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…