Political News

30 ఏళ్ల వెలిగొండ కల సాకారమయ్యే వేళ

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్ళ క్రితం ఏ ముఖ్యమంత్రి అయితే వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారో అదే ముఖ్యమంత్రి ప్రారంభహోత్సవం చేయడం ఒక చరిత్ర. ఇలాంటి గొప్ప అవకాశం ఒక్క చంద్రబాబుకు మాత్రమే దక్కింది. 1996 మార్చి 5వ తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారు. మధ్యలో నలుగురు ముఖ్యమంత్రులు వచ్చారు.. పోయారు. కానీ వెలిగొండ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేక పోయారు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే వెలిగొండను పూర్తి చేసి నేడు ప్రారంభిస్తున్నారు. ఇది చరిత్ర.. ఎవ్వరూ చేరపలేని వాస్తవం.

ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో ఆనాడు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక ప్రాంతం నుంచి 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను నల్లమల సాగర్ రిజర్వాయర్ తరలించి కరువు ప్రాంతాల ప్రజల దాహర్తిని తీర్చడానికి 978.96 కోట్ల వ్యయం అంచనాతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

అయితే 2004 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలుకావడం 15 ఏళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉండటంతో ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు. మధ్యలో ఓ ఐదేళ్లు 2014 నుంచి 2019 వరకు అధికారంలోకి వచ్చినప్పటికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి తగినంత సహకారం లభించలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్ధికంగా కుదేలైన పరిస్థితిలో కూడా వెలిగొండ కోసం 1373 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు ఆలస్యం కారణంగా అంచనా వ్యయం పదింతలు పెరిగింది. 2026 నాటికి 10,580 కోట్లకు చేరింది.

వైసీపీ ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు కొంచం నెమ్మదించాయి. 2019 నుంచి 2024 ఐదేళ్ల పదవీ కాలంలో 4003.51 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించినట్లు జగన్ అండ్ కో చెబుతుంది. నిజానికి అందులో ఖర్చు చేసింది కేవలం 981 కోట్లు మాత్రమే. అందులోనే సిబ్బంది జీత భత్యాలు, నిర్వాహణ ఖర్చులు కూడా వున్నాయి. అధికారం నుంచి దిగిపోయే నాటికి 141 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తయినట్లు జాతికి అంకితం చేయడం విమర్శల పాలయ్యింది.

జగన్ హయాంలో రెండవ టన్నెల్ లో 12 కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ ఇరుక్కొని పోయింది. దాంతో టన్నెల్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రివర్స్ టెండరింగ్ ద్వారా 62.1 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసినట్లు ప్రచారం చేసుకోవడం మినహా జగన్ చేసింది శూన్యం అంటూ అప్పట్లో టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక పునరావాసం, పరిహారం గురించి అస్సలు పట్టించుకోలేదు. పరిహారం కింద 900 కోట్ల రూపాయలు అవసరం కాగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించింది. 6200 కుటుంబాల బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. 2019 తర్వాత 18 ఏళ్ళు నిండిన యువకులను కూడా నిర్వాసితులుగా గుర్తించి వారికి 169 కోట్ల రూపాయల పరిహారం ప్రకటించింది.

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. కలుజువ్వలపాడు, సుంకేసుల, చింతలముడుపీ, బుడుంచెర్ల, కాటమరాజు తండా, సాయిరాం నగర్, మెట్టికోండి, బసవాయపల్లి, లక్ష్మి పురం, అక్కచెరువు తండా, గొట్టిపడియా గ్రామాలు నీట మునిగిపోతున్నాయి. దీనివల్ల 7321 కుటుంబాలు నిర్వాసితులవుతున్నారు.

ఈ ముంపు గ్రామాల ప్రజలకు నిబంధనల ప్రకారం పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంది. ఇప్పటికే ఈ గ్రామాల ప్రజలకు 7 పునరావాస కాలనీల ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 4 కాలనీల్లో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల ఏర్పాట్లు కూడా పూర్తి చేసి నిర్వాసితులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఇదంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగడం గమనార్హం. ప్రాజెక్టుకు పునాది రాయి వేసిన చంద్రబాబు చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేసుంటుంది. ఇప్పుడు మార్కాపురం జిల్లాలో ఏ గ్రామంలో చూసినా వెలిగొండ కబుర్లు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది.

This post was last modified on August 31, 2026 8:23 am

Share

Recent Posts

బెంగాల్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు

ప‌శ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ‌కాలం పాటు పాల‌న సాగించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం…

2 hours ago

వ‌రంగల్‌కు ఎయిర్‌పోర్టు… ఆ పేర్లు పెట్ట‌మ‌న్న‌ సందీప్ వంగ

ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాల‌నే నియ‌మాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, ప‌ట్ట‌ణాల‌కు కూడా విమానాశ్ర‌యాలు విస్త‌రిస్తున్నాయి. ఐతే మ‌రో తెలుగు…

3 hours ago

‘రాకా’ అనిరుధ్ లేదా జి.వి.ప్రకాష్ అనుకుని…

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…

3 hours ago

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

3 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

3 hours ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

5 hours ago