విజయ్ దేవరకొండ ఈ రోజు టాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా నిలబడ్డాడంటే.. పాన్ ఇండియా స్థాయిలో అతడికి మంచి గుర్తింపు ఉందంటే అందుకు ముఖ్య కారణం అర్జున్ రెడ్డి సినిమానే. దాని కంటే ముందు పెళ్ళిచూపులుతో విజయం అందుకున్నప్పటికీ.. విజయ్‌ని స్టార్‌ను చేసింది, అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది అర్జున్ రెడ్డినే. అందుకే ఆ సినిమా తీసిన దర్శక నిర్మాత సందీప్ రెడ్డి వంగ మీద విజయ్‌కి వల్లమాలిన అభిమానం.
పలు సందర్భాల్లో ఆ ఆభిమానాన్ని చూపిస్తూనే వస్తున్నాడు విజయ్. తాజాగా సందీప్ సొంత సంస్థలో తెరకెక్కిన రోమాంచకం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ ముఖ్య అతిథిగా వచ్చడు విజయ్. దీంతో చాన్నాళ్ల తర్వాత అర్జున్ రెడ్డి జోడీని స్టేజ్ మీద చూసే అవకాశం అభిమానులకు దక్కింది. ఈ సందర్భంగా మరోసారి సందీప్ మీద తన ప్రేమను చాటిచెప్పాడు విజయ్.
అర్జున్ రెడ్డి సినిమా చేయడానికి డబ్బులు లేకపోతే.. తన మీద సందీప్ రెడ్డి, సందీప్ మీద తన సోదరుడు ప్రణయ్ రెడ్డి, మిగతా కుటుంబ సభ్యులు నమ్మకం పెట్టి.. తమ పొలం అమ్మి మరీ సినిమాను పూర్తి చేశారని విజయ్ గుర్తు చేసుకున్నాడు. తమ కుటుంబ ఆస్తినంతా పెట్టి, భవిష్యత్తును పణంగా పెట్టి సినిమా తీయడం చిన్న విషయం కాదని విజయ్ వ్యాఖ్యానించాడు. తన కోసం సందీప్ ఎక్కడిదాకా అయినా వెళ్తాడని.. అలాగే సందీప్ కోసం తాను కూడా ఎంతదూరమైనా వెళ్తానని విజయ్ అన్నాడు.
సందీప్ మీద తన ప్రేమ ఎలాంటిదో తనకు తెలుసని అతను చెప్పాడు. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చానని సందీప్ తనకు థ్యాంక్స్ చెబుతున్నాడని.. కానీ సందీప్ పిలిస్తే రాకపోతే తాను బతికి వేస్ట్ అని విజయ్ పేర్కొనగా సభా ప్రాంగణం హోరెత్తిపోయింది.
వచ్చే ఏడాది అర్జున్ రెడ్డి 10 ఏళ్లు పూర్తి చేసుకోనుండగా.. ఆ సినిమా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నట్లు సందీప్ ఇటీవలే చెప్పగా.. ఇలాంటి టైంలో విజయ్, అతను కలిసి ఇలా కనిపించడం అభిమానుల్లో జోష్ పెంచింది. ఈ జోడీ కలయికలో మళ్లీ ఓ సినిమా వస్తే చూడాలన్న ఫ్యాన్స్ కోరిక కూడా రాబోయే కొన్నేళ్లలో తీరుతుందేమో చూడాలి.
This post was last modified on August 30, 2026 11:25 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…