సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్ టైంలో ఫ్లాప్ గా నిలిచిన పంజాని రీ రిలీజ్ లో సూపర్ హిట్ చేసేందుకు పూనుకున్నారు. ప్రకృతి చికిత్స కోసం కేరళ వెళ్లిన పవన్ ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా ఫ్యాన్స్, జనసేన వర్గాలు పెద్ద ఎత్తున సంబరాలకు రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు అందరి చూపు ఓజి 2 అప్డేట్ మీద ఉంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు.
మొన్నామధ్య ఒక ఈవెంట్ లో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓజి 2 అప్డేట్ వస్తుందని తమన్ చాలా నమ్మకంగా చెప్పారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఒక పోస్టర్ లేదా చిన్న యానిమేషన్ గ్లింప్స్ రిలీజ్ చేయడం మినహా అంతకన్నా ఎక్కువ కంటెంట్ రాకపోవచ్చని అంటున్నారు. సీక్వెల్ చేయడం పట్ల పవన్ చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ ఆరోగ్యం దృష్ట్యా ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనే క్లారిటీ ఎవరి దగ్గరా లేదు. దర్శకుడు సుజిత్ అటు నానితో బ్లడీ రోమియో పూర్తి చేసుకుని వచ్చాక ఓజి 2ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
సో ఎలా చూసుకున్నా ఇంకా చాలా టైం ఉంది. పవన్ ఇప్పుడప్పుడే ఎక్కువ సినిమాలు చేసేయాలని తాపత్రయంలో లేరు. అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డితో అనుకున్న ప్రాజెక్టు కూడా హోల్డ్ లో పెట్టారు. ఓజి 2 మాత్రమే సాలిడ్ గా ముందుకు వెళ్తుంది. ఒకవేళ బర్త్ డేకి ఏదైనా ఫస్ట్ లుక్ లాంటిది వదిలినా ఆ తర్వాత దాన్ని వెంటనే మర్చిపోవడం ఉత్తమం. ఎందుకంటే ఓజి 2 సెట్స్ పైకి వెళ్లి షూట్ జరుపుకుని రిలీజ్ వచ్చే నాటికి 2027 అయిపోవచ్చు.
ఇక దర్శకుడు సుజిత్ విషయానికి వస్తే ఓజి 2 స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉందట. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం వెంటనే మొదలు పెట్టేస్తారు. అయితే బ్లడీ రోమియోని వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. తమన్ సంగీతం సమకూర్చబోతున్న ఓజి 2లో ప్రియాంక మోహన్ తప్ప మిగిలిన క్యాస్టింగ్ అలాగే కొనసాగుతారు. కథ డిమాండ్ చేసినా సరే ప్రకాష్ రాజ్ వద్దని ఫ్యాన్స్ కోరుతున్న తరుణంలో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి.
This post was last modified on August 28, 2026 11:07 am
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…
ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…
మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు…
జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…