నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ హక్కులు నిర్మాత దిల్ రాజు వంద కోట్లకు కొంచెం అటు ఇటుగా డిస్ట్రిబ్యూట్ చేసే ప్రతిపాదనలో ఉన్నట్టు వచ్చిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంత ఇతిహాసం అయినా రామాయణ బాలీవుడ్ మూవీ కిందకే వస్తుంది. మెయిన్ క్యాస్టింగ్ రన్బీర్ కపూర్, సాయిపల్లవి, సన్నీ డియోల్, యష్ అందరూ ఇతర రాష్ట్రం వాళ్ళే.
మరి అలాంటప్పుడు అంత పెద్ద మొత్తం మన దగ్గర వర్కౌట్ అవుతుందానే అనుమానం రావడం సహజం. అయితే గతంలో యానిమేషన్ మూవీ అయినప్పటికీ మహావతార్ నరసింహకు ఏపీ తెలంగాణ జనం బ్రహ్మరథం పట్టారు. సో బాగా పరిచయమున్న ఆరిస్టులు చేసిన రామాయణని చూడరని చెప్పడానికి లేదు. కాకపోతే విజువల్స్, ప్రెజెంటేషన్ అన్నీ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉండాలి అదిరిపోయిందనే మాట రావాలి.. అప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు కోట్లు కుమ్మరిస్తారు.
దర్శకుడు నితేశ్ తివారి చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా టాక్సిక్ రిలీజ్ కోసం వెయిట్ చేసిన టీమ్ ఇప్పుడా లాంఛనం అయిపోవడంతో రామాయణ ప్రమోషన్ల మీద ఫోకస్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా సౌత్ మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తారట. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ రెవిన్యూ వచ్చే అవకాశం ఉండటంతో పబ్లిసిటీ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారని తెలిసింది. సెప్టెంబర్ నుంచే ఈ ప్రణాళిక అమలులోకి వస్తుంది.
ఇదంతా బాగానే ఉంది కానీ ఒక్క తెలుగు వెర్షన్ నుంచే వంద కోట్లు వసూలు కావడమంటే పెద్ద ఛాలెంజే. అసాధ్యం కాదు కానీ యునానిమస్ అనిపించుకుంటేనే ఈ ఫీట్ సాధ్యమవుతుంది. ముంబై వర్గాల కథనం ప్రకారం ఇటీవలే ఒక పావు గంట ఫుటేజీని కొందరు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లకు స్క్రీనింగ్ చేశారట. అది చూశాక కలిగిన నమ్మకంతోనే ఇంత రేట్లు డిసైడ్ అవుతున్నాయట. మరి నిజంగా దిల్ రాజు అంత మొత్తంతో రిస్క్ చేస్తారా లేక అడ్వాన్స్ పద్దతి మీద సేఫ్ గేమ్ ఆడతారా వేచి చూడాలి.
This post was last modified on August 28, 2026 11:28 am
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…