తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి సూపర్ స్టార్ కృష్ణ దాకా వాళ్ళు నటించిన ఎన్నో అద్భుతమైన సినిమాలు జనాలను అలరిస్తూ వచ్చాయి. 1983లో నటసార్వభౌమ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసిన సమయంలో ఖైదీ అనే బ్లాక్ బస్టర్ రూపంలో మాస్ ఆడియన్స్ కో కొత్త ఐకాన్ దొరికాడని ఊహించిన వాళ్ళు నిజంగా దార్శనికులు. కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి దిగ్గజాలు అలా అంచనా వేసినవాళ్ళే.
అప్పటిదాకా చూడని ఒక సరికొత్త డాన్సుని జనం చిరంజీవిలో చూశారు. అందుకే ‘పసివాడి ప్రాణం’ వసూళ్లలో సింహభాగం నృత్యాలే తీసుకున్నాయి. స్టయిల్ అంటే ఇలా ఉంటుందా అని ‘యముడికి మొగుడు’ చూశాక యువతకు అర్థమయ్యింది. సిగరెట్ ని సొగసుగా కాలుస్తూ గూండాల తుక్కు రేగ్గొడుతుంటే పరవశించిపోయి డబ్బులు విసిరారు. గ్యాంగ్ లీడర్ లో మధ్య తరగతి జులాయిగా తమను చిరులో చూసుకున్నారు. రౌడీ అల్లుడులో జానీ అంటే మన పక్కింటోడే అని భావించారు.
ఘరానా మొగుడులో రాజు, జగదేకవీరుడు అతిలోకసుందరిలో మానవ, కొదమసింహంలో భరత్, ముఠామేస్త్రిలో సుభాష్ చంద్ర బోస్ ఇలా ఏ పాత్ర చేసినా మాస్ ని ఊపేసే మ్యానరిజమ్స్ తో నిర్మాతలకు కనకవర్షం కురిపించేలా చేయడంతో మెగాస్టార్ ది ప్రత్యేక చరిత్ర. చిరంజీవి ఏడిస్తే జనం ఒప్పుకోరు. అందుకే రుద్రవీణ, ఆపద్బాంధవుడు, డాడీ ఎంత గొప్ప సినిమాలైనా కమర్షియల్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. అదంతే. చిరు అంటే నవ్వించాలి, కవ్వించాలి, మైమరపింపచేయాలి. అంతే తప్ప కన్నీళ్లు పెట్టకూడదు.
చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు చిరంజీవి వేసిన ముద్ర అలాంటిది. వరస ఫ్లాపుల తర్వాత హిట్లర్ లాంటి కంబ్యాక్ ఇచ్చినా, ఆయన పనైపోయిందని కామెంట్స్ చేసిన వాళ్లకు ఇంద్ర రూపంలో బదులు చెప్పినా, రాజకీయాల్లో విఫలమయ్యాక ఇప్పుడు ఎవరు చూస్తారని వెక్కిరించిన వాళ్లకు ఖైదీ నెంబర్ 150తో గూబ గుయ్యిమనిపించినా ఆయనకే చెల్లింది. అందుకే మాస్ ఐకాన్ గా దశాబ్దాలుగా చిరంజీవి వేసిన ముద్ర అలా జనాల మీద ఉండిపోయింది.
ఫ్యానిజంని కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా రక్తదానం, నేత్రదానం లాంటి ఎన్నో సామజిక సేవా కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షల ప్రాణాలకు ఊపిరి పోసిన ఘనత చిరంజీవికు చెందుతుంది. పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలు దక్కడం వెనుక ఇలాంటి కారణాలు బోలెడు ఉంటాయి. 71 సంవత్సరాల వయసులో నడవడమే మహా భాగ్యంగా భావించే రోజుల్లో కాకాగా అభిమానులను అలరించేందుకు ఇంకా కష్టపడుతున్న ఆయనకు ఉండాల్సిన పేరు ధన్యజీవి.
This post was last modified on August 22, 2026 10:17 am
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…
స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావడం అరుదు. ఐతే సినీ…