Political News

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. వివేకా హత్యకు 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు విచారణలో అనుమానాలు రేకెత్తడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తుంది. దీంతో ఈ నిధుల వెనక ఎవరున్నారు అనే కోణంలో విచారణ కొనసాగుతుండటంతో వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. చివరికి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఈ కథ ఎక్కడికి వెళుతుందోనని చర్చించుకుంటున్నారు.

వివేకానంద రెడ్డి వైసీపీలో క్రియాశీలం కావడంతో ఆయన ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. శివశంకర్ రెడ్డి ఈ కుట్ర చేశారని, హత్య చేస్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాడని అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఇచ్చే సందర్బంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దస్తగిరికి 5 కోట్లు ఇస్తామని ఆశ చూపించి కొంత నగదు అడ్వాన్స్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఇప్పటికే దస్తగిరి నుంచి 46.70 లక్షల రూపాయలను సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఈ నగదును ఆధారం చేసుకొని ఈడీ విచారణ నిర్వహిస్తుంది. నగదు లావాదేవీల తీగ లాగేందుకు ఎంపీ అవినాష్ ఇంటిలో తనిఖీలు చేపట్టింది.

హైదరాబాద్ జోనల్ పరిధిలోని ఈడీ అధికారులు నిర్వహించిన ఈ దాడుల్లో కీలక డాక్యూమెంట్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, డి. శివశంకర్ రెడ్డి, వై. సునీల్ యాదవ్ లపై సిబిఐ చార్జ్ షీట్ నిందితులుగా చేర్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ మనీ లాండరింగ్ కోణంలో తనదైన శైలిలో విచారణ చేస్తుంది. వివేకానంద రెడ్డి హత్యకు ఉపయోగించిన డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఆ నిధులు సమాకూర్చిన అసలు వ్యక్తులు ఎవరు, పెద్ద తలకాయలు ఎవరైనా వున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ తో పాటు వైఎస్సార్ జిల్లాలోని మొత్తం 7 చోట్ల శుక్రవారం తనిఖీలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తుంది . అవినాష్ రెడ్డికి సంబందించిన హైదరాబాద్ కోకాపేట గోల్డెన్ మైన్ రోడ్డులోని ఓపెన్ స్కై స్పేస్ అపార్ట్మెంట్లోగల నివాసంలోనూ, పులివెందులలోని నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అవినాష్ నివాసం నుంచి లెక్క చూపని 24 లక్షల నగదు, రెండు బ్యాంక్ లాకర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. డిజిటల్ పరికరాలు సైతం స్వాధీనం చేసుకున్నట్లు వినికిడి. ఈ మొత్తం పరిణామాలతో వైసీపీ ఉలిక్కి పడింది. వివేకానంద కేసును తిరగతోడుతున్నారన్న సంకేతాలతో ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తుంది.

This post was last modified on August 22, 2026 11:20 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

5 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago