అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న స్పిరిట్ మీద ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే. కేవలం పోస్టర్ తోనే సంచలనాలు రేపుతూ విడుదలనాటికి హైప్ ఎక్కడికో తీసుకెళ్లడంలో ఆయన స్టయిలే వేరు. రామ్ గోపాల్ వర్మ అంతటి కల్ట్ డైరెక్టర్స్ సైతం సందర్భం దొరికినప్పుడల్లా సందీప్ వంగని పొగడ్తలతో ముంచెత్తుతారు.
అలాంటి సందీప్ వంగ వ్యక్తిగతంగా చిరంజీవికి ఎంత పెద్ద అభిమానో చాలా సందర్భాల్లో బయట పడుతూనే ఉంటుంది. టాలీవుడ్ దర్శకుల్లో చాలా మంది తాము మెగాస్టార్ ని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చామని చెబుతుంటారు తప్పించి ఇతను ఇంత పెద్ద ఫ్యానా అనిపించేలా డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళు తక్కువ. సందీప్ వంగ మాటలు, ఆయన ఇచ్చే ఉదాహరణలు చూస్తుంటే నిజంగా ఇంత పెద్ద కల్ట్ అభిమాని చిరంజీవికి ఉండటం లక్కీనే అనిపిస్తుంది. అదెలాగో చూద్దాం.
సందీప్ వంగ నిర్మాతగా వ్యవహరించిన రోమాంచకం ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడల్లా సందీప్ చాలా లోతుగా వెళ్లిపోతున్నారు .ఖైదీ నెంబర్ 786లో భానుప్రియ చేతిలో చిరంజీవి కొరడా దెబ్బలు తినే సన్నివేశంలో ఎక్స్ ప్రెషన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి వివరంగా చెప్పడం యాంకర్ ని సైతం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు తప్ప అలాంటివి సామాన్యంగా గుర్తు ఉండవు.
చదువుకునే రోజుల్లో చిరంజీవి మాత్రమే హీరో అని ఫీలయ్యేవాడినని, తర్వాత వేరే వాళ్ళు కూడా ఉంటారని తెలిసిందని సందీప్ ఇచ్చిన ఎలివేషన్ వీడియోని నిన్న రాత్రి నుంచే సోషల్ మీడియాలో తెగ తిప్పేస్తున్నారు. గతంలో ఆరాధనలో చిరంజీవి హావభావాన్ని తన ఆఫీస్ గుమ్మం దగ్గర నిలువెత్తు ఫోటో ఫ్రేమ్ చేయించి పెట్టుకున్న సందీప్ వంగ భవిష్యత్తులో మెగాస్టార్ తో చేసే అవకాశం వస్తే వదిలి పెట్టను అంటున్నారు. అదే జరిగితే అంత కన్నా క్రేజీ ట్రీట్ సినీ ప్రియులకు ఏముంటుంది.
This post was last modified on August 22, 2026 8:31 am
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…