Movie News

ముడి విప్పేయడం మంచిదే స్వామీ

ఆగస్ట్ 21 ఇరుముడి విడుదల కానుంది. ముందు నుంచి దీని మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వరస ఫ్లాపులతో ఉన్న మాస్ మహారాజా రవితేజకు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గ్రౌండ్ లెవెల్ లో దీనికి భీభత్సమైన బజ్ లేదు. ఉన్నంతలో సాఫ్ట్ కార్నర్ ఏర్పడేందుకు కారణం హీరో వేసుకునే అయ్యప్పస్వామి మాల, టైటిల్ ని బట్టి ఇందులో ఇరుముడి కీలక పాత్ర పోషించిందని జనాలకు అర్థమైపోవడం.

దర్శకుడు శివ నిర్వాణ ఇది గుర్తించి ముందే క్లారిటీ ఇస్తున్నారు. ఇది అయ్యప్ప మీదో లేదా దేవుడి మహత్యం మీదో తీసిన సినిమా కాదని, కథలో భాగంగా రవితేజ నలభై ఒక్క రోజుల దీక్ష తీసుకుంటాడని, అది కూడా ఒక వ్యసనం తాలూకు పరిణామాలు జీవితాన్ని మార్చిన తర్వాత కూతురి కోసం మాల వేసుకుంటాడని, దానికి ముందు వెనుక జరిగిన సంఘటనలే ఈ కథకు మూలమని చెప్పుకొచ్చారు. యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ సమపాళ్ళలో ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.

ఇది ఒకరకంగా మంచిదే. ఎందుకంటే కేవలం పోస్టర్లు, టైటిల్ ని బట్టి ఇదేదో అయ్యప్ప మహిమలను చాటే సినిమాగా ఎవరైనా భావిస్తే అది వేరే రకమైన అంచనాలను ప్రేరేపిస్తుంది. ఇరుముడి అని పెట్టినా కూడా ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజీలో అన్ని అంశాలు మేళవించి శివ నిర్వాణ దీన్ని రూపొందించారు. చాలా కాలంగా స్టార్ హీరోలు ఎవరూ ఇలాంటి డివోషనల్ టచ్ ఉన్న చిత్రం చేయలేదు. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మాలధారణ చేసే భక్తులు లక్షల్లో ఉన్నారు.

సో వాళ్లకు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని ఉంటుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఇరుముడిలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా రవితేజ, పాప మధ్య ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ని చాలా హృద్యంగా డిజైన్ చేశారట. కీలకమైన మల్లెపూల పందిరి సాంగ్ ని సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో విడుదల చేయబోతున్నారు. కేవలం వారం గ్యాప్ లో టాక్సిక్ ఉన్న నేపథ్యంలో ఇరుముడి బలంగా నిలబడాలంటే యునానిమస్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్ళాలి. 

This post was last modified on August 11, 2026 4:00 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

1 hour ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

2 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

4 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

4 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

5 hours ago