Movie News

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో అవతార్ పోలిక తేవడం అభిమానులను, మీడియాని ఆశ్చర్యానికి గురి చేసింది. తాను కొన్ని విజువల్స్ చూశానని, జేమ్స్ క్యామరూన్ కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఇంకా చెప్పాలంటే మరింత గొప్పగా తీశారని చెప్పి ఓ రేంజ్ అంచనాలు పెంచేశారు. రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో సౌత్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లేది అట్లీ అనే స్థాయిలో పొగడ్తల వర్షం కురిపించారు.

వినడానికి బాగానే ఉంది కానీ ఇలాంటి కంపారిజన్లు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి. ఎందుకంటే అట్లీ గొప్ప కమర్షియల్ దర్శకుడే కావొచ్చు. కానీ ఇప్పటిదాకా రాజమౌళి, శంకర్, మణిరత్నం స్థాయిలో తనదంటూ సిగ్నేచర్ మార్కు సృష్టించుకోలేదు. జవాన్, తేరి లాంటివి ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా అవి రెగ్యులర్ జానర్ల కిందకే వస్తాయి. అందుకే కెరీర్ లో మొదటిసారి స్కై ఫై ఫాంటసీని ఎంచుకుని హాలీవుడ్ స్టూడియెలతో చేతులు కలిపి బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతున్నాడు.

ఎల్లుండి రాకా నుంచి కీలకమైన ఒక టీజర్ రాబోతోందట. అట్లీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మేకింగ్ కు సంబంధించిన ముఖ్యమైన క్లిప్స్ ఉంటాయని వినికిడి. వాటిలో కొన్ని సీన్లు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయట. అయితే ఆడియన్స్ చాలా తెలివి మీరిపోయి ఉన్నారు. కంటెంట్ ని డాక్టర్ల రేంజులో పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఏ చిన్న బిట్ తేడా కొట్టినా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నిజంగా రాకా హై స్టాండర్డ్స్ లో ఉంటే సంతోషమే, గర్వకారణమే.

ఆ పోలికేదో టీజర్ వచ్చాక, అందరు మెచ్చుకున్నాక చెబితే బాగుండేదేమోనని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాని రాకా 2027లో వస్తుందా లేక ఇంకో ఏడాది వెయిట్ చేయలానే దాని గురించి క్లారిటీ రావడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ సంగతేమో కానీ అసలు షూటింగే ఇంకా చాలా పెండింగ్ ఉంది. అట్లీ అయితే వచ్చే సంవత్సరం దసరా లేదా దీపావళిని లక్ష్యంగా పెట్టుకున్నారట. కానీ చేరుకుంటాడని మాత్రం గ్యారెంటీగా చెప్పలేం.

This post was last modified on September 19, 2026 11:43 am

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

2 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

4 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

4 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

5 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

6 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

7 hours ago