Movie News

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి లాంటి చిన్న చిత్రాలు సై అంటున్నా మిగిలినవి మాత్రం ఎందుకు రిస్కని నెక్స్ట్ వీక్ కి వెళ్లిపోతున్నాయి. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘డోరోతి’ ముందు ప్రకటించిన దాని ప్రకారం సెప్టెంబర్ 25 విడుదల కావాలి. అంటే ప్యారడైజ్ కు కేవలం ఒక్క రోజు గ్యాప్ అన్న మాట. తాజాగా వదిలిన ట్రైలర్ లో సెప్టెంబర్ 2కి వెళ్లిపోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఇది తెలివైన నిర్ణయం. ఎందుకంటే ఒకపక్క మండాడి తమిళనాడులో చాలా బలంగా ఆడుతోంది. ఇంకో రెండు వారాలు ఈ జోరు తగ్గదని బయ్యర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్యారడైజ్ ని ఢీ కొట్టడం వల్ల డోరోతికి తెలుగు రాష్ట్రాల్లో స్క్రీన్ల సమస్య వస్తుంది. అందుకే ఇవన్నీ లెక్కలేసుకుని నిర్ణయం మార్చుకున్నారు. ఇందులో ప్రత్యేకంగా స్టార్ హీరో లేరు. రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

డోరోతి స్పెషాలిటీ ఇదొక్కటే కాదు. టోరెంటో ఫిలిం ఫెస్టివల్ లో అధికారిక ప్రవేశం పొంది అక్కడి స్క్రీనింగ్ లో విమర్శకుల ప్రశంసలు పొందింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఒక పల్లెటూళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు. పెద్ద చదువు లేకపోయినా ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాంటి వీళ్ళ జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చాక మొత్తం తారుమారు అయిపోతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే అసలు కథ.

స్టోరీగా వింటే ఇందులో కొత్తదనం లేదనిపిస్తుంది కానీ ట్రీట్ మెంట్, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటాయని ఈవెంట్ లో చూసిన వాళ్ళు చెబుతున్న మాట. ఇళయరాజా పాటలకు ఇప్పటికే మంచి ఆప్లాజ్ వచ్చింది. ముత్తుమణి అనే పాట మారుమ్రోగింది. మిగిలిన ఆల్బమ్ కూడా ఇదే స్థాయిలో ఉంటుందట. అన్నట్టు ప్యారడైజ్ లో స్పెషల్ సాంగ్ చేసిన కీర్తి సురేషే ఇందులో మెయిన్ లీడ్ కావడం విశేషం. తెలుగు డబ్బింగ్ కూడా సమాంతరంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. 

This post was last modified on September 19, 2026 6:29 am

Share

Recent Posts

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

30 minutes ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

36 minutes ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

7 hours ago

వైసీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌దా.. !

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో…

7 hours ago

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

9 hours ago

ప్యారడైజ్ టీం కాయదును హర్ట్ చేసిందా?

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…

9 hours ago