Movie News

సౌందర్య మరణంపై నటి చెప్పిన చేదు నిజం

పేరుకు కన్నడ అమ్మాయే కానీ.. దివంగత నటి సౌందర్యను ఎప్పుడూ తెలుగు వాళ్లు పర భాషా కథానాయికగా చూసింది లేదు. ఆమె తన కెరీర్లో అత్యధిక సినిమాలు చేసింది, నటిగా తిరుగులేని స్థాయిని అందుకుంది తెలుగులోనే. తమిళంలో కూడా సౌందర్య ఒక వెలుగు వెలిగింది. కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించింది.

ఎంతో హుందాతనంతో కూడిన పాత్రలతో, అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సౌందర్య.. 2004లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో దుర్మరణం పాలవడం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు గుండెకోతను మిగిల్చింది. కర్ణాటకలో ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోసం వెళ్తుండగా బెంగళూరు నుంచి వెళ్తున్న విమానం కూలిపోవడంతో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా మరణించారు. 

సౌందర్య మరణం గురించి ఇప్పుడు ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయిన సీనియర్ నటి ప్రేమ చెప్పిన షాకింగ్ విషయం ఆమె అభిమానులను మరింత కలచివేస్తోంది. ‘‘సౌందర్య, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. నేను బెంగళూరులో ఉన్నప్పుడు సౌందర్య వల్ల కరెక్ట్ టైంకి ఫ్లైట్ దొరికిన సందర్భాలు ఉన్నాయి. లొకేషన్‌లో షూటింగ్ అయిపోగానే ఒకరి రూంకి ఒకరం వెళ్లి ఎంతో సరదాగా గడిపేవాళ్లం. తన ఫ్లైట్ క్రాష్ అయిందన్న వార్త వినగానే షాక్ అయ్యాను.

చూడటానికి వెళ్తే ఆమె బాడీకి తల లేదు. చేతికి ఉన్న వాచ్ చూసి సౌందర్యను గుర్తుపట్టాల్సి వచ్చింది. ఆ దృశ్యం చూసి తట్టుకోలేకపోయాను. ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా చివరికి మనతో ఏదీ రాదు అని ఆ రోజే నాకు అర్థమైంది’’ అని ప్రేమ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

సౌందర్య అసలు పేరు సౌమ్య కాగా.. సినిమాల కోసం ఆమె పేరు మార్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి ఆమె వందల సంఖ్యలో సినిమాలు చేశారు. సావిత్రి తర్వాత నటిగా అంత గొప్ప పేరు, స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటి సౌందర్యనే అని చెప్పాలి. సినిమా కెరీర్ ముగుస్తున్న దశలో, ఆమె రఘు అనే బిజినెస్‌మ్యాన్‌ను 2003లో పెళ్లి చేసుకోగా.. తర్వాతి ఏడాదే మరణించింది.

This post was last modified on September 19, 2026 9:50 am

Share

Recent Posts

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

2 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

2 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

3 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

4 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

5 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

9 hours ago