Political News

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం లేదు. ఒకవైపు చెల్లెలు షర్మిల తన కూతురి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు అన్న జగన్ విదేశీ పర్యటనకు రంగం సిద్ధం చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆ పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు.

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూతురు అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజలి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కూతురు అంజలితో కలిసి పులివెందులకు వచ్చిన షర్మిల తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించారు. సమాధిపై పెళ్లి కార్డు ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నెల 24 వ తేదీన హైదరాబాద్, 25 వ తేదీన బెంగళూరు లో నిశ్చితార్ధం జరుగుతుంది. నవంబర్ 25వ తేదీన వివాహం జరుగుతుంది. డిసెంబర్ 5వ తేదీన హైదరాబాద్ లో భారీగా రిసెప్షన్ జరుగుతుందని షర్మిల సోషల్ మీడియాలో వివరాలు పెట్టారు.

సరిగ్గా ఇదే సమయంలో జగన్ విదేశీ యాత్రకు ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి నవంబర్ 30 వ తేదీ లోపు యూరప్ వెళ్లేందుకు జగన్ సిబిఐ కోర్టుకు అనుమతి కోరారు. 25 రోజుల పాటు యూరప్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరినట్లు సమాచారం. దీంతో సిబిఐ కోర్టు అనుమతి వచ్చినట్లు విశ్వసనీయ తెలుస్తుంది . ఒకవైపు స్థానిక ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఎంతో కీలకమైన ఎన్నికలను సైతం పక్కన పెట్టి ఇప్పుడే ఫారిన్ టూర్ ఎందుకు పెట్టుకున్నారో పార్టీ నాయకులకు అర్ధం కావట్లేదు.

కూతురి పెళ్ళికి ఇన్విటేషన్ ఇచ్చేందుకు షర్మిల బెంగళూరు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. తల్లి విజయమ్మ అన్నా చెల్లెళ్ళ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయినప్పటికీ కుటుంబంతో కలిసి జగన్ విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. అంజలి పెళ్లికి వెళ్లడం జగన్, భారతీలకు ఇష్టంలేనట్లుంది పులివెందులలో ప్రచారం జరుగుతుంది. అందుకే రాష్ట్రంలో ఉండి పెళ్ళికి వెళ్లకపోతే మీడియాలో పలు రకాల వార్తలు వచ్చే అవకాశం ఉంది. అసలు దేశంలోనే లేకుండాపోతే విదేశీ ప్రయాణం వలన పెళ్ళికి హాజరుకాలేక పోయారాని చెప్పుకునే అవకాశం ఉంటుంది. నూతన దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ లో ఒక మెసేజ్ పెడితే సరిపోతుందని అలోచిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

This post was last modified on September 19, 2026 6:06 am

Share

Recent Posts

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

19 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

49 minutes ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

10 hours ago