Movie News

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు గట్టిన దుర్మార్గులు కలిసి మానభంగం చేసి చంపేస్తే, వాళ్ళను ఎన్ కౌంటర్ లో హైదరాబాద్ పోలీసులు చంపడం అప్పట్లో సెన్సేషన్. వాళ్ళ ప్రాణాలు తీయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకోవడం సోషల్ మీడియాలో హైలైటయ్యింది. ఈ కాన్సెప్ట్ మీద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సినిమా తీశారు కానీ జనం పట్టించుకోలేదు.

ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో దాయ్‌రా అనే మూవీ వచ్చింది. సలార్, వారణాసి ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించగా కరీనా కపూర్ కు ముఖ్యమైన క్యారెక్టర్ దక్కింది. స్టోరీగా చెప్పడానికేం లేదు. రేప్ కేసు నింధితులు నలుగురిని డిసిపి రామన్ కుమార్ కాల్పుల్లో చంపేస్తారు. మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు కేసు విచారణకు డిసిపి అజూని కోహ్లీ వస్తుంది. వీళ్ళ మధ్య జరిగే డ్రామానే దాయ్‌రా.

దర్శకురాలు మేఘనా గుల్జార్ కి ఎంత మంచి పేరుందో తెలిసిందే. అయితే ఈసారి కథాంశాన్ని ఎంచుకోవడంలో పొరపాటు చేశారని దాయ్‌రా చూశాక అనిపిస్తుంది. ఎందుకంటే నిస్సందేహంగా హత్య చేసింది వాళ్ళేనని బలమైన ఆధారాలు దొరికాకే పోలీసులు చేతిలో నిందితులు హతమయ్యారు. దీని వెనుక ఉద్దేశాలు ఏమైనా దారుణమైన తప్పు చేసినవాళ్లకు తగిన శిక్ష పడిందని జనం సంతోషించారు. ఇప్పుడీ కాన్సెప్ట్ తో రెండు గంటలసేపు సాగదీయడం సాహసమే.

మెయిన్ ప్లాట్ తో కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న ఈ సబ్జెక్టుని మేఘనా గుల్జార్ చాలా నెమ్మదిగా నడిపించడం దాయ్‌రాని దెబ్బ కొట్టింది. ముఖ్యంగా సెకండాఫ్ ని థ్రిల్లింగ్ గా నడిపించాల్సింది పోయి స్లోగా తీసుకెళ్లడం బోర్ కొట్టిస్తుంది. పృథ్విరాజ్, కరీనా తమ వరకు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినా వీక్ కంటెంట్ వల్ల వాళ్ళూ ఏం చేయలేకపోయారు. దిశా జరిగిన టైంలో వచ్చి ఉంటే దాయ్‌రా ఫలితం కొంచెం మెరుగ్గా ఉండేదేమో కానీ ఇప్పుడు అద్భుతాలు చేయడం అనుమానమే. 

This post was last modified on September 19, 2026 6:11 am

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

2 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

3 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

3 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

4 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

5 hours ago