Political News

విపక్షాలకు ‘షా’ అవకాశం ఎందుకిస్తున్నట్లు?

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులు, సీజేపీ, యువకులు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, వారిని దారుణంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఆ టాపిక్ తో పాటు అయోధ్య రామ మందిర విరాళాల అపహరణ అంశాలపై లోక్ సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది.

ఈ చర్చకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా రావాలని విపక్ష నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయితే, షా సభకు వస్తారని, విపక్ష నేతలు శాంతంగా ఉండాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మరోవైపు, ఝార్ఘండ్ లో విద్యార్థుల నిరనసపై చర్చించకుండానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోతున్నారని ఎన్డీఏ సభ్యులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల ఎంపీల మధ్య సభ లోపల, వెలుపల మాటల యుద్ధం జరుగుతోంది.

అయితే, ప్రధాని మోదీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తిమంతమైన నేతగా చలామణీ అవుతున్న అమిత్ షా సభకు ఎందుకు హాజరు కావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎటువంటి పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనే షా…ఈ సారి విపక్షాలకు విమర్శించే అవకాశం ఎందుకు ఇచ్చారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే, విద్యార్థుల ఉద్యమం సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలోనే షా మొఖం చాటేస్తున్నారని టాక్ వస్తోంది.

This post was last modified on August 11, 2026 4:02 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

2 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

3 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

5 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

5 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

5 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

6 hours ago