ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి చిత్రం ‘గోంధల్’ని జ్యురి సభ్యులు ఎంపిక చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇది గెలుస్తుందో లేదో తర్వాత విషయం. సభ్యులను అంతగా మెప్పించిన కంటెంట్ ఇందులో ఏముందాని జనాలు వెతకడం మొదలుపెట్టారు. మాములుగా మరాఠి సినిమాలు అంత సులభంగా ఆన్ లైన్ లో దొరకవు. పైగా పైరసీ అవకాశాలు తక్కువే. అందుకే ఇంత ఆసక్తి నెలకొంది.
అసలు గోంధల్ కథేంటో చూద్దాం. మహారాష్ట్రలో ఒక సంప్రదాయముంది. కొత్తగా పెళ్ళైన జంటకు ఒక రాత్రంత్రా ఊరి పెద్దలు, కుటుంబ సభ్యులు కలిసి చేసే ఆచారానికి గోంధల్ అని పేరు. ఆనంద్, సుమన్ కొత్త జంట. అయితే సుమన్ అంతకుముందే సాహెబ్ రావు అనే యువకుడిని ప్రేమించి ఉంటుంది. తనను ఇష్టపడిన గ్రామాధికారి కొడుకు సర్జేరావుని రెచ్చగొట్టి ఆనంద్ ని చంపమని అడుగుతుంది. ఇలా చేస్తే భర్త చనిపోయి, వెంటపడ్డవాడు జైలుకు వెళ్తే తాను సాహెబ్ తో పారిపోవచ్చని ప్లాన్ వేస్తుంది. అయితే గోంధల్ వేడుక మొదలయ్యాక అసలు ట్విస్టులు జరుగుతాయి. అవేంటనేది తెరమీద చూస్తేనే కిక్కు.
దర్శకుడు సంతోష్ దావాఖర్ అత్యంత సహజంగా గోంధల్ తెరకెక్కించిన తీరు కట్టిపడేసేలా ఉంటుంది. మనమూ ఆ ఊరిలో ఇదంతా కళ్లారా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగిస్తారు. ఇషితా దేశ్ ముఖ్, యోగేష్ సహోని, కిషోర్ కదం నటన మెయిన్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లోనూ అమలేందు చౌదరి ఛాయాగ్రహణం అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో సాగతీత, నమ్మశక్యం కాని కొన్ని పాత్రల ప్రవర్తన గ్రాఫ్ ని తగ్గిస్తాయి. అయినా సరే ట్విస్టులు పేలతాయి.
అయితే నిజంగా గోంధల్ అంత గొప్ప సినిమానా అంటే ఔనని కాదని రెండు సమాధానాలు చెప్పలేం. ఎందుకంటే ఇదో డిఫరెంట్ జానర్. జ్యురి సభ్యుల లెక్కలు ఎలా ఉన్నా ఆస్కార్ నామినేషన్ కు కావాల్సిన అర్హతలు అయితే ఉన్నాయనిపిస్తుంది. ఇది ఆర్ట్ ఫిలింలాగా అనిపించే క్రైమ్ అంశాలు ఉన్న కమర్షియల్ మూవీ. కాకపోతే మరాఠి స్టయల్ లో ఆర్గానిక్ గా ఉంటుంది. నేటివిటీ కారణంగా గోంధల్ ని ఇతర భాషల్లో రీమేక్ చేసే ఛాన్స్ లేదు కానీ స్టోరీ లైన్ అయితే వాడుకునేలా ఉంటుంది.
This post was last modified on September 19, 2026 11:46 am
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…
ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…