Movie News

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని తిరుగుతోంది. యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ రేపో ఎల్లుండో జరిగేలా ఉందని ఫిలిం నగర్ టాక్. ఉదయం దాకా డేట్ లో ఎలాంటి మార్పు లేదని, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరసగా ఉంటాయని, వెంకటేష్ లండన్ నుంచి తిరిగి రాగానే ఈ లాంఛనాలు అయిపోతాయని యూనిట్ వర్గాలు చెబుతూ వచ్చాయి. కానీ కొన్ని గంటల్లోనే సీన్ రివర్స్ అయ్యింది.

తాజా సమాచారం ప్రకారం ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30 వచ్చే సూచనలున్నాయి. దసరాకు ఆల్రెడీ జైలర్ 2, రణబాలి ఉన్న నేపథ్యంలో వాటితో తలపడటం సమస్య కాకపోయినా బ్యాలన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఒత్తిడి కొని తెచ్చుకోవాలి కాబట్టి ఇరవై రోజుల గ్యాప్ సేఫ్ అని యూనిట్ భావిస్తున్నట్టు తెలిసింది. నిర్మాత నాగవంశీ ఈ ప్రచారంకు ఇంకా స్పందించలేదు. ఒకవేళ నిజం కాకపోతే తనదైన శైలిలో ఈ పాటికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు.

ఒకరకంగా చూసుకుంటే ఆదర్శం నిజంగా వెనుకడుగు వేయడం అవసరమే. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ దీనికి పూర్తి స్థాయి బజ్ రాలేదు. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోకు ఉండాల్సిన హైప్ ఇంకా ఏర్పడలేదని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఇప్పుడు సరిపడా సమయం దొరుకుతుంది కాబట్టి పబ్లిసిటీని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అయిపోయాయి కనక ఫ్రెష్ గా వేరే కార్యక్రమాలను ప్లాన్ చేయాల్సి ఉంటుంది.

ఆదర్శ కుటుంబం ఆల్బమ్ నుంచి నారాయణమ్మ పాట ఒకటే బయటికి వచ్చింది. తమన్ కంపోజ్ చేసిన మిగిలిన పాటలు ఎలా ఉంటాయోనని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. శ్రీనిధి శెట్టి మెయిన్ హీరోయిన్ కాగా నివేత పేతురేజ్ మరో ముఖ్యమైన పాత్ర చేసింది. డింపుల్ హయతి ఒక సాంగ్ లో మెరవనుంది. పోలీస్ ఆఫీసర్ గా నారా రోహిత్ క్యారెక్టర్ స్పెషల్ గా ఉంటుందట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం ప్రయోజనం కలిగించేదే.

This post was last modified on October 4, 2026 10:56 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

19 minutes ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

1 hour ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

1 hour ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

2 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

3 hours ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

4 hours ago