Political News

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లలో ఎంత నిజం వుందో తెలియదు కానీ తెలంగాణా రాజకీయాలలో పెను దుమారం రేపుతోంది. తెలంగాణా ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆంధ్రా పాలకులను దోపిడిదారులుగా విమర్శలు గుప్పించిన కేసీఆర్ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అమరావతిలో హోటల్ కడతారని నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

ఇటీవల కొంతకాలంగా తెలంగాణాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి రాజుకోవడం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల సమయంలో జరిగిన ఘర్షణలతో ఇరు పార్టీల మధ్య వైరం పీక్ దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తుల గురించి బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ఫాం హౌస్ గురించి కాంగ్రెస్ నాయకులు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పటికీ ఆస్తులు, వ్యాపారాల గొడవ కంటిన్యూ అవుతోంది.

దీనికి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేటీఆర్ హోటల్ నిర్మాణం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఒక 5-స్టార్ హోటల్‌ను నిర్మిస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అత్యంత లగ్జరీగా నిర్మిస్తున్న ఈ హోటల్ ఇంటిరియర్ డెకరేషన్ కోసం ఇటాలియన్ మార్బుల్‌ను వాడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. హోటల్ ఎలివేషన్ కోసం విదేశీ గ్లాస్ ప్యానల్స్, యూరప్ దేశాల నుండి దిగుమతి చేసుకున్న షాండ్లియర్స్ ఉపయోగిస్తున్నట్లు మసాలా దట్టించారు.

ఈ ఆరోపణలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రపూరిత ప్రచారమని బీఆర్ఎస్ నాయకులు క్లారిటీ ఇచ్చారు. అమరావతిలో కేటీఆర్ హోటల్ కడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు. కేటీఆర్ కూడా స్వయంగా ఖండించారు. తన వ్యాపారాల గురించి 2009 ఎన్నికల ఆఫీడఫిట్లో స్పష్టంగా పేర్కొన్నట్లు వివరించారు.

అయితే అమరావతిలో కేటీఆర్ హోటల్ నిర్మిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం ఏమీ లేదు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి భూ కేటాయింపులు చేసినట్లు సీఆర్డీఏ ప్రకటించలేదు. ప్రస్తుతం అమరావతిలో క్రౌన్ ప్లాజా, మారియట్, నోవా టెల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు స్టార్ హోటళ్లను నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ హోటళ్లకు కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. సో… ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటిస్తేనే తప్ప కేటీఆర్ అమరావతి హోటల్ కథ ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు.

This post was last modified on October 4, 2026 11:10 pm

Share

Recent Posts

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

8 hours ago