Movie News

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి త‌న‌ చివ‌రి సినిమా పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. 2020లో భార‌త్, చైనా స‌రిహ‌ద్దులోని గాల్వాన్ లోయ‌లో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జ‌రిగిన భీక‌ర పోరు నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ముందు బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అని టైటిల్ పెట్టారు.

కానీ చైనా నుంచి అభ్యంత‌రాలు రావ‌డం, కేంద్ర ప్ర‌భుత్వం కూడా అడ్డు చెప్ప‌డంతో ఈ టైటిల్ మార్చి మాతృభూమి అని పెట్టారు. అంతే కాక సినిమాలో చాలా స‌న్నివేశాల‌ను కూడా మార్చాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. దాదాపు 40 శాతం రీషూట్లు కూడా చేశారు. కానీ ఎంత చేసినా స‌రే.. ఈ సినిమాకు క్లియ‌రెన్స్ రాలేదు. విడుద‌ల‌కు నోచుకోలేదు. చైనా లాంటి ప‌వ‌ర్ ఫుల్ కంట్రీతో ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసే ప్ర‌మాదం ఉన్న‌ సినిమా కావ‌డంతో సెన్సార్ చేయ‌డానికి ముందే కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సిన ప‌రిస్థితి మాతృభూమి టీంకు వ‌చ్చింది.

మినిస్ట్రీ సూచ‌న‌ల ప్ర‌కారం మార్పులు చేర్పులు చేసి, రీషూట్లు అన్నీ పూర్తి చేసి సినిమాను రెడీ చేసిన మేక‌ర్స్.. ఇటీవ‌లే మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధుల‌కు మాతృభూమి ఫ‌స్ట్ కాపీ చూపించార‌ట. అక్క‌డి నుంచి నిర‌భ్యంత‌ర ప‌త్రం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే సెన్సార్ బోర్డుకు సినిమాను పంపించ‌బోతున్నార‌ట‌. మినిస్ట్రీ నుంచి క్లియ‌రెన్స్ వ‌చ్చిందంటే సెన్సార్ బోర్డు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌బోతున్నట్లే. అంతా అనుకున్న‌ట్లే జ‌రిగితే న‌వంబ‌రు 13న మాతృభూమిని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకుంటున్నారు.

కానీ ఈ సినిమా ఫ‌లితం మీద చాలా సందేహాలున్నాయి. ఈ సినిమా తీసిన దర్శకుడు అపూర్వ ల‌ఖియా ట్రాక్ రికార్డు పేల‌వం. రామ్ చరణ్‌తో ‘జంజీర్’ లాంటి కళాఖండం తీసిన దర్శకుడు అపూర్వ. ఆ తర్వాత కూడా అతడి నుంచి గొప్ప సినిమాలేవీ రాలేదు. సినిమా చాలా ఆల‌స్యం కావ‌డం.. క‌థ‌లో మార్పులు చేర్పులు.. రీషూట్ల తాలూకు నెగెటివిటీని అధిగ‌మించి ఈ సినిమా ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటుందో చూడాలి మ‌రి.

This post was last modified on October 4, 2026 10:13 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

4 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

4 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

6 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

6 hours ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

8 hours ago