Movie News

నాని మీద ఒత్తిడి పెరుగుతోంది

ఆగస్ట్ నుంచి తప్పుకున్నాక ది ప్యారడైజ్ కొత్త విడుదల తేదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 24 అని బలంగా ప్రచారం జరిగింది కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో నాని మీద ఒత్తిడి పెరుగుతోందని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ పేరుతో ఎక్కువ సమయం తీసుకోవడం పరిస్థితి ఇంకా కిందకు తీసుకెళ్లేలా ఉండటంతో, నాని స్వయంగా రంగంలోకి దిగి పనులు వేగంగా జరిగేలా చొరవ తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఒక ప్యాన్ ఇండియా మూవీకి డేట్లు మారుతూ వెళ్లి ఆలస్యం చేస్తూ పోతే దాని బజ్ మీద ఎంత ప్రభావం పడుతోందో ఇటీవలే వచ్చిన పెద్ది దీన్ని ఋజువు చేసింది. చికిరి చికిరి టైంలో ఉన్న హైప్ కి ట్రైలర్ వచ్చిన తర్వాత చూసిన రెస్పాన్స్ కి అసలు సంబంధమే లేనట్టుగా అయ్యింది. అయినా సరే రామ్ చరణ్ ఇమేజ్ ఓ మూడు వందల కోట్ల దాకా లాగింది కానీ బయట మార్కెట్లలో చేతులు ఎత్తేసింది. ప్యారడైజ్ ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఖచ్చితంగా సెప్టెంబర్ లో రావడం తప్ప వేరే ఆప్షన్ లేదని కూడా వినిపిస్తోంది. ఓటిటితో చేసుకున్న డీల్ కారణంగా ఇంత కన్నా లేట్ చేస్తే ఇచ్చే మొత్తంలో కోత విధించే అవకాశాలు ఉన్నాయట. అంతదాకా రాకుండా టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోందని అంతర్గతంగా వినిపిస్తోంది. అనిరుధ్ రవిచందర్ పూర్తి ఆల్బమ్ ఇచ్చాడా లేదానే క్లారిటీ కూడా లేదు. రెండో పాటని వదులుతామని ఆ మధ్య ఊరించారు కానీ ఇప్పుడసలు దాని ఊసే లేకుండా పోయింది.

వేగానికి మారుపేరుగా ఉన్న నాని స్పీడ్ గత ఏడాదిగా తగ్గిపోయింది. హిట్ 3 వచ్చి ఏడాది దాటేసింది. ప్యారడైజ్ విపరీతమైన ఆలస్యానికి గురయ్యింది. బ్లడి రోమియో అనౌన్స్ మెంట్ ఇచ్చాక అప్డేట్స్ ఆగిపోయాయి. దర్శకుడు సుజిత్ హఠాత్తుగా ఓజి 2కి షిఫ్ట్ అయిపోవడం న్యాచురల్ స్టార్ అభిమానులను కన్ఫ్యూజ్ చేసింది. మరో ఇద్దరు దర్శకులు నానితో సినిమాల కోసం లైనప్ లో ఉన్నారు. ఇవన్నీ బ్యాలన్స్ కావాలంటే ముందైతే నాని ప్యారడైజ్ ని జపాన్ ట్రైన్ రేంజ్ లో పరిగెత్తించాలి.

This post was last modified on July 23, 2026 7:07 pm

Share

Recent Posts

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

24 minutes ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

42 minutes ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

58 minutes ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

2 hours ago

ప్యారడైజ్ ఈవెంట్ సూపర్ హిట్

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…

2 hours ago

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

4 hours ago