Political News

లోకేష్ సహనానికి బాబు ప్రశంసల జల్లు

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఏక‌బిగిన ఏడున్న‌ర గంట‌ల పాటు నిల‌బ‌డి.. ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయ‌డాన్ని ఆయ‌న కొనియాడారు. యువ నాయ‌కులు అంద‌రూ ఇలానే ప‌నిచేస్తే.. కూట‌మికి ప్ర‌త్యేకంగా ప్ర‌చారం అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల‌ను పంపిణీ చేయ‌డం ప‌ట్ల చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇంటి ప‌ట్టాల‌ను అందించేందుకు స్వయంగా నారా లోకేష్ చూపిన చొర‌వ‌ను కూడా అభినందించారు.

ఇంటికి – కుటుంబానికి మ‌ధ్య ఎంతో బంధం ఉంటుంద‌న్న చంద్ర‌బాబు.. పేద‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు.. ఇంటి పట్టాల పంపిణీని స్వ‌యంగా చేప‌ట్ట‌డం ఉత్త‌మ మార్గ‌మ‌ని తెలిపారు. అధికారుల‌కు బాధ్య‌త‌లు వ‌దిలేయ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. ఇక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే త‌ర‌హాలో పేద‌ల‌కు ఇంటి ప‌ట్టాల‌ను స్వ‌యంగా పంపిణీ చేయాలని సూచించారు. తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో చంద్ర‌బాబు ఈమేర‌కు దిశానిర్దేశం చేశారు.

గొడ్డ‌లి పార్టీతో జాగ్ర‌త్త అంటూ.. వైసీపీ విష‌యంలో మంత్రుల‌కు కొన్ని హెచ్చ‌రిక‌లు చేశారు. లేనిపోని వివాదాల‌ను సృష్టించి.. వాటిని కూట‌మి ప్ర‌భుత్వంపై విసిరే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆరోపించారు. వీటిని ఎప్ప‌టికప్పుడు ప‌సిగ‌ట్టి ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. కేబినెట్ భేటీ అనంత‌రం.. చంద్ర‌బాబు ప‌లు విష‌యాల‌ను మంత్రుల‌తో చ‌ర్చించారు. క్షేత్ర‌స్థాయిలో వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో మంత్రులు వెనుక‌బడుతున్నార‌ని తెలిపారు. ఈ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవాల‌న్నారు.

ఇక‌, మెగా డీఎస్సీని-నీట్‌ను లింక్ చేసి గొడ్డ‌లి పార్టీ ఏపీలో ఆందోళ‌న‌లు సృష్టించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని.. ఈ ప‌రిస్థితుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వివాదాలు సృష్టించే వారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉపేక్షించ‌రాద‌ని ఆయ‌న తెలిపారు. అంతే బ‌లంగా తిప్పికొట్టాల‌న్నారు. మంత్రులు-క‌లెక్ట ర్… మ‌ధ్య స‌ఖ్య‌త ఉండాల‌ని, క‌ల‌సి ప‌నిచేయాల‌ని సూచించారు. 

This post was last modified on July 23, 2026 7:17 pm

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

3 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

6 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

6 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

6 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

9 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

10 hours ago