ఐమాక్స్ లందు.. రియల్ ఐమాక్స్ వేరు అంటారు. ఈ ఫార్మాట్ మూడు రకాల రేషియాల్లో ఉంటుంది. అందులో 70 ఎంఎం థియేటర్లో 1.43:1 రేషియాలో సినిమా చూడడం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందంటారు. ఐతే ఈ ఫార్మాట్ ఉన్న థియేటర్లు ప్రపంచం మొత్తం మీద కేవలం 41 మాత్రమే కావడం గమనార్హం. అందులో 26 అమెరికాలోనే ఉన్నాయి. మిగతా థియేటర్లు యూకేలో 3, ఆస్ట్రేలియాలో 1, చెక్‌రిపబ్లిక్‌లో 1.. ఇంకా కొన్ని దేశాల్లో ఒక్కో థియేటర్ ఉన్నాయి.
ఇండియాలో ఐమాక్స్ స్క్రీన్లు ఉన్నప్పటికీ.. ఎక్కడా 70 ఎంఎం థియేటర్ మాత్రం లేదు. వేరే సినిమాలైతే ఈ ఐమాక్స్‌లతో సరిపెట్టుకోవచ్చు కానీ.. క్రిస్టఫర్ నోలన్ పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతోనే తీసిన ది ఒడిస్సీ లాంటి సినిమాలను మాత్రం 70 ఎంఎం ఐమాక్స్ థియేటర్లలోనే చూడాలంటారు నిపుణులు. ఆ అనుభవమే వేరని.. ఆ అనుభూతికి మరేదీ సాటిరాదని ఒడిస్సీని ఈ ఫార్మాట్లో చూసిన వాళ్లు చెబుతున్నారు.
ఐతే విదేశాలకు వెళ్లి ఈ సిసలైన ఐమాక్స్ స్క్రీన్లలో ది ఒడిస్సీ చూడాలన్నా వెంటనే పని జరగదు. ఈ సినిమాకు ఐమాక్స్ 70 ఎంఎం స్క్రీన్లలో మామూలు డిమాండ్ లేదు. అమెరికాలో ఉన్న 26 రియల్ ఐమాక్స్ స్క్రీన్లలో వచ్చే నెల రోజుల్లో టికెట్ ముక్క దొరికే పరిస్థితి లేదు. చాలా థియేటర్లలో రెండు నెలల వరకు బుకింగ్స్ అయిపోయాయి. మిగతా దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. లండన్‌లోని ఒక థియేటర్లో అయితే సెప్టెంబరు 10 వరకు ది ఒడిస్సీ షోలు సోల్డ్ ఔట్ అట.
ఈ సినిమాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఐమాక్స్ 70ఎంఎం థియేటర్లలో రౌండ్ ద క్లాక్ షోలు నడిపిస్తున్నారు. తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి దాటాక కూడా షోలు ఆడుతున్నాయి. అయినా డిమాండును అందుకోవడం కష్టంగా ఉంది. ఈ స్క్రీన్లలో ఏడాది మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి పెట్టేయగా.. కొన్ని నెలల తర్వాత డేట్లకు కూడా టికెట్లు వేగంగా అమ్ముడవుతుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
