Movie News

వావ్… తెలుగు సినిమాకు 9 నేష‌న‌ల్ అవార్డులు

తెలుగు సినిమాలో స్క్రీన్ ప్లే అన‌గానే గుర్తుకొచ్చే పేరు.. సుకుమార్‌. ఈ లెక్క‌ల మాస్టారి క‌థ‌న నైపుణ్యం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. స్క్రీన్ ప్లే పాఠాలు నేర్చుకోవాలంటే సుకుమార్ సినిమాలు చూడాల‌ని అంటారు విశ్లేష‌కులు. ఇప్పుడాయ‌న నైపుణ్యాన్ని నేష‌న‌ల్ అవార్డుల జ్యూరీ కూడా గుర్తించింది. 2024 సంవ‌త్స‌రానికి ఉత్త‌మ స్క్రీన్ ప్లే ర‌చ‌యిత‌గా సుకుమార్ జాతీయ అవార్డుకు ఎంపిక‌య్యారు. పుష్ప: ది రూల్ చిత్రానికి ఆయ‌నీ అవార్డును అందుకోనున్నారు.

ఇదే చిత్రానికి దీపాలి నూర్, శీత‌ల్ శ‌ర్మ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్స్‌గా ఎంపిక‌య్యారు. ల‌క్కీ భాస్క‌ర్ చిత్రానికి గాను వెంకీ అట్లూరి ఉత్త‌మ సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌గా ఎంపిక‌య్యాడు. 2024 జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకు మొత్తంగా 9 అవార్డులు ద‌క్క‌డం విశేషం. ఉత్త‌మ పిల్ల‌ల చిత్రంగా 35-చిన్న‌క‌థ కాదు ఎంపికైంది. ఇదే చిత్రానికి అరుణ్ దేవ్ బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకోనున్నాడు.

ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన సినిమాగా క‌ల్కి 2898 ఏడీ పుర‌స్కారం పొంద‌గా.. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌కు గాను ఈ సినిమాకు ప‌ని చేసిన‌ నితిన్ జిహానీ చౌద‌రి ఎంపిక‌య్యాడు. ఉత్త‌మ ప్రాంతీయ తెలుగు చిత్రంగా క‌మిటీ కుర్రోళ్లు ఎంపికైంది. అలాగే బెస్ట్ మేక‌ప్ పుర‌స్కారం కూడా ఇదే సినిమాకు ప‌ని చేసిన ర‌వికుమార్ గెలుచుకున్నాడు.

ఉత్త‌మ న‌టులుగా మ‌మ్ముట్టి (భ్ర‌మ‌యుగం), కార్తీక్ ఆర్య‌న్ (చందు ఛాంపియ‌న్) ఇద్ద‌రూ ఎంపిక‌య్యారు. ఉత్త‌మ న‌టిగా యామి గౌత‌మ్ (ఆర్టిక‌ల్ 370), ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా రాజ్ కుమార్ పెరియ‌స్వామి (అమ‌ర‌న్) పుర‌స్కారాలు ద‌క్కించుకున్నారు. తెలుగులోనూ విజ‌య‌వంత‌మైన త‌మిళ చిత్రం మ‌హారాజలో విజ‌య్ సేతుప‌తి కూతురి పాత్ర చేసిన స‌చ‌న ఉత్త‌మ స‌హాయ న‌టిగా ఎంపికైంది. బెస్ట్ యాక్ష‌న్ అవార్డు కూడా ఈ సినిమాకే ద‌క్కింది. అమ‌రన్ చిత్రానికి జి.వి.ప్ర‌కాష్ కుమార్ ఉత్త‌మ నేప‌థ్య‌ సంగీత ద‌ర్శ‌కుడి పుర‌స్కారం ద‌క్కించుకున్నాడు.

ఇంత‌కుముందు సూరారై పొట్రు (బీజీఎం), వాత్తి (మ్యూజిక్‌) చిత్రాల‌కు నేష‌న‌ల్ అవార్డులు అందుకున్న జి.వి.ప్ర‌కాష్‌కు ఇది మూడో పుర‌స్కారం కావ‌డం విశేషం. ఆర్టిక‌ల్ 370 చిత్రానికి శ‌శ్వంత్ ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా పుర‌స్కారం ద‌క్కించుకున్నాడు. అమ‌ర‌న్ సినిమాకు బెస్ట్ ఎడిట‌ర్‌గా క‌లైవాన‌న్ ఎంపిక‌య్యాడు. ధ‌నుష్ హీరోగా న‌టిస్తూ డైరెక్ట్ చేసిన రాయ‌న్ ఉత్త‌మ త‌మిళ చిత్రంగా ఎంపికైంది. త‌మ‌న్నా డ్యాన్స్ చేసిన ఆజ్ కీ రాత్ (స్త్రీ) పాట‌కు విజ‌య్ గంగూలీ బెస్ట్ కొరియోగ్రాఫ‌ర్‌గా ఎంపికయ్యాడు. శ్రీకాంత్ మూవీ ఉత్త‌మ హిందీ చిత్రంగా నిలిచింది.

This post was last modified on July 18, 2026 9:15 pm

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

2 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

5 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

5 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

5 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

8 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

9 hours ago